యత్ర కాలే త్వనావృత్తిం
ఆవృత్తిం చైవ యోగినః ।
ప్రయాతా యాంతి తం కాలం
వక్ష్యామి భరతర్షభ ॥
యత్ర, కాలే, తు, అనావృత్తిమ్, ఆవృత్తిమ్, చ, ఏవ, యోగినః,
ప్రయాతాః, యాంతి, తమ్, కాలమ్, వక్ష్యామి, భరతర్షభ.
భరతర్షభ = భరతశ్రేష్ఠా; యత్ర కాలే = ఏ కాలంలో (ఏ మార్గంలో); ప్రయాతాః తు = ప్రయాణిస్తే; యోగినః = ఉపాసకులూ (కర్మిష్ఠులూ); (యథాక్రమంగా) అనావృత్తిమ్ = ముక్తిని; ఆవృత్తిం చ = పునర్జన్మను; యాంతి ఏవ = పొందుతారో; తమ్ = ఆ; కాలమ్ = కాలాన్ని గురించి; వక్ష్యామి = చెబుతాను.
తా ॥ ఓ భరతశ్రేష్ఠా! ఏ ఏ మార్గాలలో వెళ్ళిన యోగులు తిరిగి రారో మరియు తిరిగి వస్తారో, అట్టి కాలమార్గాల గురించి నీకు వివరిస్తాను.