వేదావినాశినం నిత్యం
య ఏనమజమవ్యయమ్ ।
కథం స పురుషః పార్థ
కం ఘాతయతి హంతి కమ్ ॥
వేద, అవినాశినమ్, నిత్యమ్, యః, ఏనమ్, అజమ్, అవ్యయమ్,
కథమ్, సః, పురుషః, పార్థ, కమ్, ఘాతయతి, హంతి, కమ్.
యః = ఎవడు; ఏనమ్ = ఈ ఆత్మను; అవినాశినమ్ = నాశం లేనిది; నిత్యమ్ = వృద్ధిరహితం; అజమ్ = జన్మరహితం; అవ్యయమ్ = క్షయం లేనిదని; వేద = గ్రహిస్తాడో; పార్థ = అర్జునా; సః = ఆ; పురుషః = వ్యక్తి; కథం = ఎలా; కమ్ = దేనిని; ఘాతయతి = చంపించును; కమ్ = దేనిని; హంతి = చంపును?
తా ॥ ఓ పార్థా! ఆత్మ వినాశనం లేనిదని, నిత్యమైనదని, పుట్టుక లేనిదని, మార్పు లేనిదని తెలుసుకున్న జ్ఞాని ఎవరిని చంపుతాడు? ఎవరిని చంపమని ప్రేరేపిస్తాడు?
వ్యాఖ్య:-
ఆత్మ శాశ్వతమైనది (నిత్యం ఉండేది) కాబట్టి, దాన్ని ఎవరూ చంపలేరు, ఎవరి చేతా చంపించలేరు అని దీని భావం.