కులక్షయే ప్రణశ్యంతి
కులధర్మాః సనాతనాః ।
ధర్మే నష్టే కులం కృత్స్నం
అధర్మోఽభిభవత్యుత ॥ 40
అధర్మాభిభవాత్ కృష్ణ
ప్రదుష్యంతి కులస్త్రియః ।
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ
జాయతే వర్ణసంకరః ॥ 41
సంకరో నరకాయైవ
కులఘ్నానాం కులస్య చ ।
పతంతి పితరో హ్యేషాం
లుప్తపిండోదకక్రియాః ॥ 42
కులక్షయే, ప్రణశ్యంతి, కులధర్మాః, సనాతనాః,
ధర్మే, నష్టే, కులమ్, కృత్స్నమ్, అధర్మః, అభిభవతి, ఉత.
అధర్మాభిభవాత్, కృష్ణ, ప్రదుష్యంతి, కులస్త్రియః,
స్త్రీషు, దుష్టాసు, వార్ష్ణేయ, జాయతే, వర్ణసంకరః.
సంకరః, నరకాయ, ఏవ, కులఘ్నానామ్, కులస్య, చ,
పతంతి, పితరః, హి, ఏషామ్, లుప్త పిండ ఉదక క్రియాః.
కులక్షయే = కులనాశనం వల్ల; సనాతనాః = శాశ్వతములైన; కుల ధర్మాః = కుల ధర్మాలు; ప్రణశ్యంతి = నశిస్తాయి; ఉత = మరియు; ధర్మే = ధర్మము; నష్టే = నశించగా; అధర్మః = అధర్మం; కులమ్ = వంశం; కృత్స్నమ్ = అంతటిని; అభిభవతి = వశ మొనర్చుకొనును. కృష్ణ = కృష్ణా; అధర్మ అభిభవాత్ =అధర్మాక్రమణం వల్ల; కులస్త్రియః = కుల స్త్రీలు; ప్రదుష్యంతి = చెడిపోవుదురు; స్త్రీషు = ఆడవారు; దుష్టాసు = చెడిపోవ; వార్ష్ణేయ = కృష్ణా; వర్ణసంకరః = వర్ణ సంకరం; జాయతే = కలుగుతుంది. సంకరః = సంకరం; కులఘ్నానాం = కుల ఘాతకులకు; కులస్యచ = కులమంతటికి; నరకాయ ఏవ = నరకకారణమే అగును; హి = ఏలనగా; ఏషాం చ = వీరి; పితరః = పితృపురుషులు కూడా; లుప్త పిండ ఉదక క్రియాః = పిండదాన, తర్పణక్రియలు లేనివారై; పతంతి = నరకంలో పడతారు.
తా ॥ కులక్షయం సంభవించినప్పుడు సనాతనమైన కులధర్మాలు నశిస్తాయి. ధర్మం నశించినప్పుడు ఆ కులమంతా అధర్మం పాలవుతుంది. కృష్ణా! అధర్మం పెరిగిపోతే కులస్త్రీలు కలుషితమవుతారు. స్త్రీలు శీలహీనులైనప్పుడు వర్ణసంకరం జరుగుతుంది. ఆ వర్ణసంకరం వల్ల కులాన్ని నాశనం చేసినవారు, ఆ కులము కూడా నరకానికి వెళ్తారు. పితృదేవతలకు పిండప్రదానాలు, తర్పణాలు అందకపోవడం వల్ల వారు కూడా అధోగతి పాలవుతారు.