ఏతాన్న హంతుమిచ్ఛామి
ఘ్నతోఽపి మధుసూదన ।
అపి త్రైలోక్యరాజ్యస్య
హేతోః కిం ను మహీకృతే ॥
ఏతాన్, న, హంతుమ్, ఇచ్ఛామి, ఘ్నతః, అపి, మధుసూదన,
అపి, త్రైలోక్యరాజ్యస్య, హేతోః, కిమ్, ను, మహీకృతే.
మధుసూదన = కృష్ణా; ఘ్నతః అపి = (నన్ను) చంపుచున్న వారి నైనను; ఏతాన్ = వీరిని; త్రైలోక్యరాజ్యస్య = త్రిలోకాధిపత్యపు; హేతోః అపి = నిమిత్తమైనా; హంతుమ్ = వధింప; న ఇచ్ఛామి = కోరను; మహీకృతే = భూలోక రాజ్యం కొరకు; కిం ను = ఇక చెప్పవలెనా?
తా ॥ ఓ మధుసూదనా! వీరు నన్ను చంపినా సరే, నేను మాత్రం వీరిని చంపాలని కోరుకోవడం లేదు. మూడు లోకాల రాజ్యమే లభించినా సరే, ఈ భూమి కోసం నేను నా వారిని చంపుతానా? అది అసంభవం.
వ్యాఖ్య:-
“మధుసూదనః” – మధువను రాక్షసుని జంపుటచే శ్రీకృష్ణునకు మధుసూదనుడను పేరువచ్చినది.