యేషామర్థే కాంక్షితం నో
రాజ్యం భోగాః సుఖాని చ ।
త ఇమేఽవస్థితా యుద్ధే
ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ॥ 33
ఆచార్యాః పితరః పుత్రాః
తథైవ చ పితామహాః ।
మాతులాః శ్వశురాః పౌత్రాః
శ్యాలాః సంబంధినస్తథా ॥ 34
యేషామ్, అర్థే, కాంక్షితమ్, నః, రాజ్యమ్, భోగాః, సుఖాని, చ,
తే, ఇమే, అవస్థితాః, యుద్ధే, ప్రాణాన్, త్యక్త్వా, ధనాని, చ.
ఆచార్యాః, పితరః, పుత్రాః, తథా, ఏవ, చ, పితామహాః,
మాతులాః, శ్వశురాః, పౌత్రాః, శ్యాలాః, సంబంధినః, తథా.
యేషామ్ అర్థే = ఎవరి కొరకు; నః = మనకు; రాజ్యమ్ = రాజ్యాన్ని; భోగాః = భోగాలను; సుఖాని చ = సుఖాలను; కాంక్షితం = కోరబడినదో; తే ఇమే = ఆ ఈ; ఆచార్యాః = ఆచార్యులు; పితరః = తండ్రులు; పుత్రాః = పుత్రులు; తథా చ = అదే విధంగా, పితామహాః ఏవ = పితామహులు; మాతులాః = మేనమామలు; శ్వశురాః = మామలు; పౌత్రాః = మనుమలు; శ్యాలాః = బావమరుదులు; తథా = మఱియు; సంబంధినః = బంధువులు; ప్రాణాన్ = ప్రాణాలను; ధనాని చ = సంపదలను; త్యక్త్వా = వదలి; యుద్ధే = రణభూమిలో; అవస్థితాః = నిలిచి ఉన్నారు.
తా ॥ ఎవరి కోసం మనం ఈ రాజ్యాన్ని, భోగాలను, సుఖాలను కోరుకుంటున్నామో, అట్టి మన గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు మరియు ఇతర బంధువులందరూ తమ ప్రాణాల మీద, ధనం మీద ఆశ వదులుకుని ఇక్కడ యుద్ధ రంగంలో నిలబడి ఉన్నారు.