నిమిత్తాని చ పశ్యామి
విపరీతాని కేశవ ।
న చ శ్రేయోఽనుపశ్యామి
హత్వా స్వజనమాహవే ॥
నిమిత్తాని, చ, పశ్యామి, విపరీతాని, కేశవ
న, చ, శ్రేయః, అనుపశ్యామి, హత్వా, స్వజనమ్, ఆహవే
కేశవ = కృష్ణా; విపరీతాని = అశుభ సూచకములైన; నిమిత్తాని = శకునములు; పశ్యామి = చూస్తున్నాను. కృష్ణ = శ్రీకృష్ణా; ఆహవే = యుద్ధమున; స్వజనమ్ = బంధువులను; హత్వా = చంపి; శ్రేయః = శుభమును; న అనుపశ్యామి = చూడజాలకున్నాను.
తా ॥ ఓ కేశవా! నాకు అంతా అశుభ సూచకాలే కనిపిస్తున్నాయి. యుద్ధంలో నా స్వజనాన్ని చంపి నేను పొందే శ్రేయస్సు ఏముంటుందో నాకు అర్థం కావడం లేదు.