కృషిగౌరక్ష్యవాణిజ్యం
వైశ్యకర్మ స్వభావజమ్ ।
పరిచర్యాత్మకం కర్మ
శూద్రస్యాపి స్వభావజమ్ ॥
కృషిగౌరక్ష్య వాణిజ్యమ్, వైశ్యకర్మ స్వభావజమ్,
పరిచర్య ఆత్మకమ్, కర్మ, శూద్రస్య, అపి, స్వభావజమ్.
కృషి గౌరక్ష్య వాణిజ్యమ్ = కృషి, గోరక్షణ, వాణిజ్యాలు; స్వభావజమ్ వైశ్య కర్మ = స్వాభావికాలైన వైశ్యకర్మలు; శూద్రస్య అపి = శూద్రునికి అనినచో; పరిచర్య ఆత్మకమ్ = సేవా రూపమైన; కర్మ = కర్మ; స్వభావజమ్ = స్వభావ సిద్ధం;
తా ॥ వ్యవసాయం, గోరక్షణ, వాణిజ్యం – ఇవి వైశ్యుని సహజ కర్మలు. ఇతరులకు సేవ చేయడం లేదా పరిచర్య చేయడం అనేది శూద్రుని సహజ కర్మ.