బుద్ధేర్భేదం ధృతేశ్చైవ
గుణతస్త్రివిధం శృణు ।
ప్రోచ్యమానమశేషేణ
పృథక్త్వేన ధనంజయ ॥
బుద్ధేః, భేదమ్, ధృతేః, చ, ఏవ, గుణతః, త్రివిధమ్, శృణు,
ప్రోచ్యమానమ్, అశేషేణ, పృథక్త్వేన, ధనంజయ.
ధనంజయ = అర్జునా; బుద్ధేః = బుద్ధియొక్క; ధృతేః చ = ధృతియొక్క; గుణతః ఏవ = గుణాలను అనుసరించునవే అయిన; త్రివిధమ్ = మూడు విధాలైన; భేదమ్ = భేదాన్ని; పృథక్త్వేన = వేరు వేరుగానూ; అశేషేణ = సంపూర్ణంగానూ; ప్రోచ్యమానమ్ = చెప్పబడే దానిని; శృణు = విను.
తా ॥ ఓ ధనంజయా! బుద్ధి మరియు ధృతి లో ఉన్న మూడు రకాల భేదాలను విను.