జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా
త్రివిధా కర్మచోదనా ।
కరణం కర్మ కర్తేతి
త్రివిధః కర్మసంగ్రహః ॥
జ్ఞానమ్, జ్ఞేయమ్, పరిజ్ఞాతా, త్రివిధా, కర్మచోదనా,
కరణమ్, కర్మ, కర్తా, ఇతి, త్రివిధః, కర్మసంగ్రహః.
కర్మచోదనా = కర్మప్రేరకమైనది; జ్ఞానమ్ = జ్ఞానం; జ్ఞేయమ్ = తెలిసికోదగినది; పరిజ్ఞాతా = తెలుసుకునేవాడు; (అని) త్రివిధాః = మూడు విధాలు; కర్మసంగ్రహః = కర్మకు ఆశ్రయం; కరణమ్ = ఇంద్రియం; కర్మ = క్రియ; కర్తా = చేసేవాడు; ఇతి = అని; త్రివిధః = మూడు విధాలు.
తా ॥ జ్ఞానము (తెలివి), జ్ఞేయము (తెలుసుకోవలసిన విషయం), పరిజ్ఞాత (తెలుసుకునేవాడు) – ఈ మూడూ కర్మకు ప్రేరణనిస్తాయి. అలాగే కరణము (పనిముట్టు), కర్మ (పని), కర్త (చేసేవాడు) – ఈ మూడూ కర్మ యొక్క స్వరూపాన్ని ఏర్పరుస్తాయి.