శరీరవాఙ్మనోభిర్యత్
కర్మ ప్రారభతే నరః ।
న్యాయ్యం వా విపరీతం వా
పంచైతే తస్య హేతవః ॥
శరీర వాక్ మనోభిః, యత్, కర్మ, ప్రారభతే, నరః,
న్యాయ్యమ్, వా, విపరీతమ్, వా, పంచ, ఏతే, తస్య, హేతవః.
నరః = మనుష్యుడు; శరీర వాక్ మనోభిః = త్రికరణాలతో; యత్ = ఏ, న్యాయ్యమ్ వా = ధర్మయుక్తమూ, శాస్త్రీయమూ అయినది గాని; విపరీతమ్ వా = అన్యాయమైనది గాని; ఏతే = ఈ; పంచ = ఐదూ; తస్య = ఆ కర్మకు; హేతవః = హేతువులు.
తా ॥ మనిషి తన శరీరం, మాట లేదా మనస్సుతో చేసే న్యాయమైన లేదా అన్యాయమైన ఏ పనికైనా ఈ ఐదే కారణాలు.