సత్కారమానపూజార్థం
తపో దంభేన చైవ యత్ ।
క్రియతే తదిహ ప్రోక్తం
రాజసం చలమధ్రువమ్ ॥
సత్కార మాన పూజ అర్థమ్, తపః, దంభేన, చ, ఏవ, యత్,
క్రియతే, తత్, ఇహ, ప్రోక్తమ్, రాజసమ్, చలమ్, అధ్రువమ్.
సత్కార-మాన–పూజ–అర్థమ్ = సత్కారం, గౌరవం, పూజను పొందడానికి; దంభేన ఏవ చ = దంభంతో; యత్ = ఏ; తపః = తపస్సు; క్రియతే = ఆచరింపబడుతుందో; తత్ = అది; ఇహ = ఈ లోకంలో; చలమ్ = అల్పకాలం ఉండేదనీ; అధ్రువమ్ = అనిశ్చితమనీ; రాజసమ్ = రాజసమనీ; ప్రోక్తమ్ = చెప్పబడింది;
తా ॥ సత్కారం, గౌరవం, పూజల కోసం ఆడంబరంతో చేసే తపస్సు రాజసమైనది. ఇది అస్థిరమైనది మరియు తాత్కాలికమైనది.
వ్యాఖ్య:-
కొంతమంది తమ తపస్సును చూసి పదిమంది తమను గౌరవించాలని, సత్కరించాలని ఆశించి తపస్సు చేయడం మొదలుపెడతారు. కానీ అది మంచి ఉద్దేశంతో, మనస్ఫూర్తిగా చేసేది కాదు కాబట్టి అది నిలకడగా ఉండదు. దాని వల్ల వచ్చే ఫలితం కూడా అలాగే అస్థిరంగా, అనిశ్చితంగా ఉంటుంది. కాబట్టి జ్ఞానులు లేదా తెలివైనవారు ఇలాంటి పద్ధతిని అనుసరించకూడదు.