శ్రీ భగవానువాచ :
పశ్య మే పార్థ రూపాణి
శతశోఽథ సహస్రశః ।
నానావిధాని దివ్యాని
నానావర్ణాకృతీని చ ॥
పశ్య, మే, పార్థ, రూపాణి, శతశః, అథ, సహస్రశః,
నానావిధాని, దివ్యాని, నానావర్ణ ఆకృతీని, చ.
పార్థ = అర్జునా; మే = నా; దివ్యాని = అలౌకికములును; నానా విధాని = బహు విధాలైన; నానా వర్ణ ఆకృతీని చ = వివిధ వర్ణాలతో, ఆకృతులతో ఒప్పుచున్నవీ; శతశః = వందలూ; అథ = ఇంకా; సహస్రశః = వేలూ అయిన; రూపాణి = రూపాలను; పశ్య = చూడు;
తా ॥ శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ పార్థా! వందల కొద్దీ, వేల కొద్దీ ఉన్న నా దివ్య రూపాలను చూడు. అవి రకరకాలుగా, అనేక రంగులలో, అనేక ఆకృతులలో ఉన్నాయి.