శ్రీభగవానువాచ :
కాలోఽస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ।
ఋతేఽపి త్వాం న భవిష్యంతి సర్వే
యేఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః ॥
కాలః, అస్మి, లోకక్షయకృత్, ప్రవృద్ధః, లోకాన్, సమాహర్తుమ్, ఇహ, ప్రవృత్తః,
ఋతే, అపి, త్వామ్, న, భవిష్యంతి, సర్వే, యే, అవస్థితాః, ప్రత్యనీకేషు, యోధాః.
లోక క్షయ కృత్ = లోకసంహారకుడనై; ప్రవృద్ధః = విజృంభించిన; కాలః = కాలుడను; అస్మి = (నేను) అయి ఉన్నాను; లోకాన్ = ప్రాణులను; సమాహర్తుమ్ = సంహరింప; ఇహ = ఇప్పుడు; ప్రవృత్తః = మొదలిడితిని; త్వాం ఋతే అపి = నీవు లేకున్నా; ప్రత్యనీకేషు = శత్రుపక్షంలోని; యే = ఏ; యోధాః = వీరులు; అవస్థితాః = ఉన్నారో; సర్వే = వారందరూ; న భవిష్యంతి = ఉండరు.
తా ॥ శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: నేను లోకాలను నాశనం చేసే మహాకాలాన్ని. ఇప్పుడు ఈ లోకాలను అంతం చేయడానికి సిద్ధమయ్యాను. నీవు యుద్ధం చేయకపోయినా, ఇక్కడ ఇరుపక్షాలలో ఉన్న యోధులెవరూ బ్రతకరు.