భవాప్యయౌ హి భూతానాం
శ్రుతౌ విస్తరశో మయా ।
త్వత్తః కమలపత్రాక్ష
మాహాత్మ్యమపి చావ్యయమ్ ॥
భవ అప్యయౌ, హి, భూతానామ్, శ్రుతౌ, విస్తరశః, మయా,
త్వత్తః, కమలపత్ర అక్ష, మాహాత్మ్యమ్, అపి, చ, అవ్యయమ్.
కమల పత్ర అక్ష = తామర రేకుల వంటి కన్నులు గల (శ్రీకృష్ణా); త్వత్తః = నీ నుండి; భూతానామ్ = భూతాల యొక్క; భవ అప్యయౌ = జనన మరణాలు రెండూ; మయా = నా వలన; విస్తరశః హి = విశదంగానే; శ్రుతౌ = వినబడినవి; (నీ) అవ్యయమ్ = అక్షయమైన; మాహాత్మ్యమ్ అపి చ = (సర్వాత్మకత్వ, నిర్లేపత్వాదికమైన) మహిమను కూడా (విన్నాను).
తా ॥ ఓ కమలాల వంటి కన్నులు గలవాడా! ప్రాణుల ఉత్పత్తి, లయాల గురించి నీ నుండి వివరంగా విన్నాను. అలాగే నీ నాశనం లేని గొప్పతనాన్ని కూడా తెలుసుకున్నాను.