నభఃస్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ ।
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా
ధృతిం న విందామి శమం చ విష్ణో ॥
నభః స్పృశమ్, దీప్తమ్, అనేక వర్ణమ్, వ్యాత్త ఆననమ్, దీప్తవిశాల నేత్రమ్,
దృష్ట్వా, హి, త్వామ్, ప్రవ్యథిత అంతరాత్మా, ధృతిమ్, న, విందామి, శమమ్, చ, విష్ణో.
విష్ణో = సర్వవ్యాపీ (కృష్ణా); నభః స్పృశమ్ = ఆకాశాన్ని అంటుతూ; దీప్తమ్ = తేజోమయమై; అనేక వర్ణమ్ = నానావర్ణ విశిష్టుడవై; వ్యాత్త ఆననమ్ = విస్ఫారవదనుడవై; దీప్త విశాల నేత్రమ్ = ఉజ్జ్వలమూ, విశాలమూ అయిన నేత్రాలతో ఒప్పారుతున్న; త్వామ్ = నిన్ను; దృష్ట్వా హి = చూచుటచే; ప్రవ్యథిత అంతరాత్మా = కలత పడిన మనస్సుతో (నేను); ధృతిమ్ = ధైర్యాన్ని; శమం చ = శాంతిని; న విందామి = పొందలేకున్నాను.
తా ॥ ఓ విష్ణో! ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న, ప్రజ్వరిల్లుతున్న అనేక రంగులు గల, తెరిచిన నోళ్లు, భయంకరమైన పెద్ద కళ్లు గల నిన్ను చూసి నా అంతరాత్మ వణికిపోతోంది. నాకు ధైర్యము కానీ, మనశ్శాంతి కానీ కలగడం లేదు.