నాంతోఽస్తి మమ దివ్యానాం
విభూతీనాం పరంతప ।
ఏష తూద్దేశతః ప్రోక్తో
విభూతేర్విస్తరో మయా ॥
న, అంతః, అస్తి, మమ, దివ్యానామ్, విభూతీనామ్, పరంతప,
ఏషః, తు, ఉద్దేశతః, ప్రోక్తః, విభూతేః, విస్తరః, మయా.
పరంతప = అర్జునా; మమ = నా; దివ్యానామ్ = దివ్యములైన; విభూతీనామ్ = విభూతులకు; అంతః = తుది; న అస్తి = లేదు; ఏషః తు = అయినా ఈ; విభూతేః = విభూతుల; విస్తారః = వివరణ; మయా = నాచే; ఉద్దేశతః = సంక్షేపంగా; ప్రోక్తః = చెప్పబడింది.
తా ॥ ఓ పరంతప! నా దివ్య విభూతులకు అంతం లేదు. నేను నీకు వివరించినది నా అనంతమైన విభూతులలో ఒక చిన్న భాగం మాత్రమే.
వ్యాఖ్య:-
భగవంతుడు అనంతుడు (అంతులేనివాడు). కాబట్టి ఆయన విభూతులకు (దివ్య మహిమలకు) కూడా అంతం అనేది ఉండదు. ఆయన మహిమలన్నింటినీ పూర్తిగా వర్ణించడం సాధ్యం కాదు కాబట్టి, ఇక్కడ కేవలం క్లుప్తంగా (సంక్షిప్తంగా) మాత్రమే వివరించడం జరిగింది.