అనంతశ్చాస్మి నాగానాం
వరుణో యాదసామహమ్ ।
పితౄణామర్యమా చాస్మి
యమః సంయమతామహమ్ ॥
అనంతః, చ, అస్మి, నాగానాం, వరుణః, యాదసామ్, అహమ్,
పితౄణామ్, అర్యమా, చ, అస్మి, యమః, సంయమతామ్, అహమ్.
నాగానాం = పెక్కుతలలు గల నాగులలో; అనంతః = శేషుడను; అస్మి = అయి ఉన్నాను; యాదసాం చ = జలదేవతలలో; అహమ్ = నేను; వరుణః = వారికి రాజైన వరుణుణ్ణి; పితౄణామ్ = పితృదేవతలలో; అర్యమా = అర్యముణ్ణి; సంయమతాం చ = శాసించే వారిలో; యమః = యముడను; అహమ్ = నేను; అస్మి = అయి ఉన్నాను
తా ॥ నాగులలో నేను శేషనాగును. జలచరాలకు అధిపతియైన వరుణుడిని. పితృదేవతలలో నేను అర్యముడిని. శిక్షించేవారిలో నేను యమధర్మరాజును.
వ్యాఖ్య:-
‘నాగానామ్’ – నాగులకు (నాగజాతి పాములకు) చాలా తలలు ఉంటాయి, కానీ వాటిలో విషం ఉండదు. అదే సర్పాలకు (మామూలు పాములకు) అయితే ఒకే తల ఉంటుంది, కానీ వాటిలో విషం ఉంటుంది. నాగులకు, సర్పాలకు మధ్య ఉన్న తేడా ఇదే.