పురోధసాం చ ముఖ్యం మాం
విద్ధి పార్థ బృహస్పతిమ్ ।
సేనానీనామహం స్కందః
సరసామస్మి సాగరః ॥
పురోధసామ్, చ, ముఖ్యమ్, మామ్, విద్ధి, పార్థ, బృహస్పతిమ్,
సేనానీనామ్, అహమ్, స్కందః, సరసామ్, అస్మి, సాగరః.
పార్థ = అర్జునా; మామ్ = నన్ను; పురోధసాం చ = పురోహితులలో; ముఖ్యమ్ = ప్రధానుడైన; బృహస్పతిమ్ = బృహస్పతిగా; విద్ధి = గ్రహించు; అహమ్ = నేను; సేనానీనామ్ = సేనాపతులలో; స్కందః = కుమారస్వామిని; సరసామ్ = సరస్సులలో; సాగరః = సముద్రుణ్ణి; అస్మి = అయి ఉన్నాను.
తా ॥ ఓ పార్థా! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే అని తెలుసుకో. సేనాధిపతులలో నేను కుమారస్వామిని. జలాశయాలలో నేను సముద్రాన్ని.
వ్యాఖ్య:-
“ముఖ్యమ్” (ప్రధానమైనది) అని ప్రత్యేకంగా చెప్పడాన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుందంటే… ఎక్కడైతే గొప్పతనం (శ్రేష్ఠత్వం), పవిత్రత (స్వచ్ఛత) ఉంటాయో, అవే దైవత్వానికి నిజమైన గుర్తులు అని స్పష్టంగా తెలుస్తోంది.