వేదానాం సామవేదోఽస్మి
దేవానామస్మి వాసవః ।
ఇంద్రియాణాం మనశ్చాస్మి
భూతానామస్మి చేతనా ॥
వేదానామ్, సామవేదః, అస్మి, దేవానామ్, అస్మి, వాసవః,
ఇంద్రియాణామ్, మనః, చ, అస్మి, భూతానామ్, అస్మి, చేతనా.
వేదానామ్ = చతుర్వేదాలలో; సామ వేదః = సామ వేదాన్ని; అస్మి = అయి ఉన్నాను; దేవానామ్ = దేవతలలో; వాసవః = ఇంద్రుడను; అస్మి = అయి ఉన్నాను; ఇంద్రియాణామ్ = ఏకాదశేంద్రియాలలో; మనః = సంకల్ప వికల్పాత్మకమైన మనస్సును; అస్మి = అయి ఉన్నాను; భూతానాం చ = ప్రాణుల శరీరంలో; చేతనా = జ్ఞాన శక్తిని; అస్మి = అయి ఉన్నాను.
తా ॥ వేదాలలో నేను సామవేదాన్ని. దేవతలలో నేను ఇంద్రుడిని. ఐదు ఇంద్రియాలలో నేను మనస్సును. ప్రాణులలో నేను చైతన్యమును.