స్వయమేవాత్మనాత్మానాం
వేత్థ త్వం పురుషోత్తమ ।
భూతభావన భూతేశ
దేవదేవ జగత్పతే ॥
స్వయమ్, ఏవ, ఆత్మనా, ఆత్మానమ్, వేత్థ, త్వమ్, పురుష ఉత్తమ,
భూతభావన, భూత ఈశ, దేవదేవ, జగత్పతే.
పురుష ఉత్తమ = పురుషోత్తమా; భూత భావన = భూతోత్పాదకా; భూత-ఈశ = జీవ నియామకా; దేవ దేవ = ఆదిత్యాది దేవతలను ప్రకాశింపజేయువాడా; జగత్-పతే = విశ్వపాలకా; త్వమ్ = నీవు; స్వయం ఏవ = నీయంతట నీవే; ఆత్మనా = సాధనాంతర వ్యతీతంగా, (ఆత్మచేత); ఆత్మానమ్ = నిన్ను; వేత్థ = తెలిసికుంటున్నావు.
తా ॥ ఓ పురుషోత్తమా! ప్రాణులను సృష్టించేవాడా, ప్రాణులకు అధిపతివైనవాడా, దేవతలకు దేవుడవైనవాడా, విశ్వపాలకా! నిన్ను నీవు మాత్రమే నీ జ్ఞానంతో తెలుసుకోగలవు.