సర్వమేతదృతం మన్యే
యన్మాం వదసి కేశవ ।
న హి తే భగవన్ వ్యక్తిం
విదుర్దేవా న దానవాః ॥
సర్వమ్, ఏతత్, ఋతమ్, మన్యే, యత్, మామ్, వదసి, కేశవ,
న, హి, తే, భగవన్, వ్యక్తిమ్, విదుః, దేవాః, న, దానవాః.
కేశవ = కృష్ణా; మామ్ = నన్ను గూర్చి; యత్ = దేనిని; వదసి = చెప్పుచున్నావో; ఏతత్ = ఈ; సర్వమ్ = సమస్తమును; ఋతమ్ = సత్యమని; మన్యే = తలతును; హి = ఏమన; భగవన్ = ఈశ్వరా; తే = నీ; వ్యక్తిమ్ = ఆవిర్భావమును; దేవాః = దేవతలు; దానవాః = దానవులు; న విదుః = ఎరుగరు.
తా ॥ ఓ కేశవా! నీవు నాకు చెప్పినదంతా సత్యమని నేను నమ్ముతున్నాను. ఓ భగవంతుడా! నీ ఆవిర్భావాన్ని దేవతలు కానీ, దానవులు కానీ ఎవరూ ఎరుగరు.
వ్యాఖ్య:-
“మీరు చెప్పిందంతా నిజమేనని నేను నమ్ముతున్నాను” అని అనడం ద్వారా… గురువుగారి మాటల మీద తనకున్న పూర్తి విశ్వాసాన్ని శిష్యుడు బయటపెడుతున్నాడు. శిష్యుడు ఇలా తన నమ్మకాన్ని ప్రకటించడం వల్ల, గురువుగారికి ఆ శిష్యుడి మీద ప్రేమ, వాత్సల్యం (కన్నబిడ్డపై ఉండే ఆప్యాయత) ఇంకా ఎక్కువవుతాయి.