| 1775 | క్షుదీరాం జననం. |
| 1791 | చంద్రమణీదేవి జననం. |
| 1805 | రామ్కూమార్ జననం. |
| 1814 | కామార్పుకూర్లో క్షుదీరాం స్థిరవాసం. |
| 1826 | రామేశ్వర్ జననం. |
| 1835 | క్షుదీరాం గయాయాత్ర. |
| 1836 | ఫిబ్రవరి 17, ఉదయం 4 గంటలకు శ్రీరామకృష్ణుల జననం. |
| 1843 | క్షుదీరాం మరణం. |
| 1845 | శ్రీరామకృష్ణుల ఉపనయనం. |
| 1850 | కలకత్తాలో రామ్‌కుమార్ వేదపాఠశాల ప్రారంభం. |
| 1852 | కలకత్తాకు శ్రీరామకృష్ణుల రాక. |
| 1853 | డిసెంబర్ 22, మాతృమూర్తి శారదాదేవి జననం. |
| 1855 | దక్షిణేశ్వర కాళికాలయ స్థాపన. దక్షిణేశ్వరంలో హృదయ్. విష్ణ్వాలయ పూజారిగా శ్రీరామకృష్ణుల నియామకం, తదనంతరం కాళికాలయపూజారిగా నియుక్తులు కావటం. |
| 1856 | రామ్‌కుమార్ మరణం. భగవత్సాక్షాత్కారం, శ్రీరామకృష్ణుల ప్రథమ భగవదోన్మత్త స్థితి. |
| 1857 | గంగాప్రసాద్ వద్ద శ్రీరామకృష్ణులకు చికిత్స. |
| 1858 | కాళికాలయ పూజారిగా హలధారి. శ్రీరామకృష్ణుల కామార్పుకూర్ ఆగమనం. |
| 1859 | శ్రీరామకృష్ణుల వివాహం. |
| 1860 | దక్షిణేశ్వరానికి తిరిగి రావటం. మథుర్ బాబు దివ్యదర్శనం. |
| 1861 | రాణీరాస్మణి కాలధర్మం. భైరవీ బ్రాహ్మణి రాక, ఆమె పర్యవేక్షణలో శ్రీరామకృష్ణుల తంత్రసాధన. ద్వితీయ దైవోన్మత్త స్థితి. |
| 1863 | తంత్ర సాధన పరిసమాప్తి. పద్మలోచన్తో సమావేశం. దక్షిణేశ్వరంలో వసింప చంద్రమణీదేవి రావటం. |
| 1864 | జటాధారి పర్యవేక్షణలో శ్రీరామకృష్ణుల వాత్సల్యభావ సాధన. మధురభావ సాధన. తోతాపురి నుండి సన్న్యాస స్వీకారం. |
| 1865 | హలధారి స్థానే అక్షయ్. దక్షిణేశ్వరానికి తోతాపురి వీడ్కోలు. |
| 1866 | ఆరు నెలల కాలం శ్రీరామకృష్ణులు అద్వైత భూమికలో నెలకొని ఉండటం. క్రైస్తవం, ఇస్లాం మత సాధన. |
| 1867 | కామార్పుకూర్లో బ్రాహ్మణికి వీడ్కోలు. |
| 1868 | తీర్థయాత్ర. బృందావనంలో గంగామాయిని కలుసుకోవటం. |
| 1870 | మథుర్బాబుతో యాత్ర. కొలూటోలా హరిసభలో శ్రీరామకృష్ణులు. కాల్నా, నవద్వీప్ సందర్శనం. |
| 1871 | మథుర్బాబు మరణం. |
| 1872 | మాతృమూర్తి శారదాదేవి దక్షిణేశ్వర ప్రథమ సందర్శనం. షోడశీపూజ. |
| 1873 | రామేశ్వర్ మరణం. |
| 1874 | శ్రీ మాతృదేవి దక్షిణేశ్వరం మళ్ళీ రావటం. |
| 1875 | కేశవచంద్రసేన్తో శ్రీరామకృష్ణుల ప్రథమ సమావేశం. చివరిసారిగా కామార్పుకూర్కు వెళ్ళడం. |
| 1876 | చంద్రమణీదేవి కాలధర్మం |
| 1877, 1878 | కేశవ్‌తో సాన్నిహిత్యం. మాతృదేవి మూడవసారి దక్షిణేశ్వర్ రావటం. |
| 1879 | శిష్యుల ఆగమనానికి నాంది. |
| 1881 | హృదయ్‌కు ఉద్వాసన. రాఖాల్, నరేంద్రనాథ్ల రాక. |
| 1882 | విద్యాసాగర్‌తో సమావేశం. మాతృదేవి దక్షిణేశ్వర పునరాగమనం. |
| 1884 | కేశవ్సేన్ మరణం. శశధర్ పండితునితో సమావేశం. గోపాల్ మా. దక్షిణేశ్వరంలో వసింప మాతృదేవి చివరిసారిగా రావడం. |
| 1885 | పానీహాటీ చివరి సందర్శనం. అస్వస్థత, శ్యాంపుకూర్‌కు తరలించటం. డాక్టర్ సర్కార్‌తో సహచర్యం. కాశీపూర్‌కు తరలించటం. |
| 1886 | కాశీపూర్‌లో చికిత్స. శిష్యులను సంఘటితం చేయటం. ఆగష్టు 16, ఉదయం 1–02 గం ॥ మహాసమాధి. |