దోషైరేతైః కులఘ్నానాం
వర్ణసంకరకారకైః ।
ఉత్సాద్యంతే జాతిధర్మాః
కులధర్మాశ్చ శాశ్వతాః ॥ 43
ఉత్సన్నకులధర్మాణాం
మనుష్యాణాం జనార్దన ।
నరకేనియతం వాసో
భవతీత్యనుశుశ్రుమ ॥ 44
దోషైః, ఏతైః, కులఘ్నానామ్, వర్ణసంకరకారకైః,
ఉత్సాద్యంతే, జాతిధర్మాః, కులధర్మాః, చ, శాశ్వతాః.
ఉత్సన్న కులధర్మాణామ్, మనుష్యాణామ్, జనార్దన,
నరకే, నియతమ్, వాసః, భవతి, ఇతి, అనుశుశ్రుమ
ఏతైః = ఈ; వర్ణసంకర కారకైః = వర్ణ సంకర కారకాలైన; దోషైః = దోషాల చేత; కులఘ్నానామ్ = కులఘాతకుల; శాశ్వతాః = సనాతనములైన; జాతి ధర్మాః = వర్ణధర్మాలు; కులధర్మాః చ = కుల ధర్మాలను; ఉత్సాద్యంతే = ఉత్సన్నములు, సమూలముగ నశించినవి అవుతున్నాయి. జనార్దన = కృష్ణా; ఉత్సన్న కులధర్మాణామ్ = వినష్ట కులధర్ములైన; మనుష్యాణామ్ = మానవులకు, నియతమ్ = తప్పనిదై; నరకే = నరకంలో; వాసః = వాసం; భవతి = కలుగుతుంది; ఇతి = అని; అనుశుశ్రుమ = గురుశిష్య పరంపరగా వింటున్నాము.
తా ॥ కులాన్ని నాశనం చేసేవారు చేసే ఈ వర్ణసంకర దోషాల వల్ల శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు పూర్తిగా నశించిపోతాయి. ఓ జనార్దనా! కులధర్మాలను కోల్పోయిన మనుష్యులు శాశ్వతంగా నరకంలోనే నివసిస్తారని మనం పెద్దల ద్వారా విన్నాము.