లేలిహ్యసే గ్రసమానస్సమంతాత్
లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః ।
తేజోభిరాపూర్య జగత్సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ॥
లేలిహ్యసే, గ్రసమానః, సమంతాత్, లోకాన్, సమగ్రాన్, వదనైః, జ్వలద్భిః,
తేజోభిః, ఆపూర్య, జగత్, సమగ్రమ్, భాసః, తవ, ఉగ్రాః, ప్రతపంతి, విష్ణో.
జ్వలద్భిః = దీప్యమానమైన; వదనైః = ముఖాలతో; లోకాన్ = ఈ వీరులను; సమగ్రాన్ = అందరినీ; గ్రసమానః = మ్రింగుతూ; సమంతాత్ = అన్నియెడల; లేలిహ్యసే = ఆస్వాదిస్తున్నావు; విష్ణో = భగవంతుడా; తవ = నీ; ఉగ్రాః = తీవ్రమైన; భాసః = ప్రభలు; తేజోభిః = కాంతులతో; ఆపూర్య = నిండి; సమగ్రం జగత్ = జగత్తు నంతటిని; ప్రతపంతి = తపింపజేయుచున్నవి.
తా ॥ ఓ విష్ణో! నీవు మండుతున్న నోళ్లతో లోకాలన్నింటినీ మింగుతూ, అన్ని వైపులా నాలుకతో ఆస్వాదిస్తున్నావు. నీ భయంకరమైన తేజస్సు ఈ జగత్తంతటా వ్యాపించి తపింపజేస్తోంది.