ఈ విభాగంలో
‘అమెరికా సోదర సోదరీమణులారా!’ అనే మాటల ద్వారా వేలమంది ప్రజల హృదయాలను ఆకట్టుకొని, చికాగో సర్వమత మహాసభ మూలంగా అంతర్జాతీయ రంగంలో తమను అభివ్యక్తం చేసుకోవడం.
అనేక ప్రతిఘటనలను సంబాళించుకోవడం.
ఐదంశాల పనుల మూలంగా ప్రాచీన భారత ఆధ్యాత్మిక సందేశాన్ని పాశ్చాత్య దేశాలకు అందించడం.
‘నాలుగు యోగాలు’, ‘అనుష్ఠాన వేదాంతం’ లాంటి మహోన్నత కానుకలను తమ ప్రసంగాల ద్వారా లోకానికి అందించడం.
విభిన్న ఆప్తుల, శిష్యుల ద్వారా పనులను విస్తృతపరచడం.
కొందరికి ఆధ్యాత్మిక జీవితంలో శిక్షణనివ్వడం.
చింతనాశీలురు, విజ్ఞానవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కళాకారులులాంటి వారిని కలుసుకొని వారిని ప్రభావితం చేయడం.
అమెరికా, ఇంగ్లండ్, లేదా మరెక్కడైనా సరే ఆధ్యాత్మిక ఉన్నతోన్నత స్థితుల్లో విరాజిల్లడం.
పేదరికం, వ్యాధి, మూఢనమ్మకాల సమాహారమే భారతదేశమని నమ్మిన పాశ్చాత్యులకు కనువిప్పు కలిగించి, యథార్థమైన ఆధ్యాత్మికతను వారికి అవగతం చేయడం.
దాదాపు నాలుగున్నర సం ॥ లు పాశ్చాత్యదేశాలలో నివసించిన తరువాత భారతదేశ కార్యకలాపాలలో తమకు దోహదం చేసే కొందరు శిష్యులతో భారతదేశానికి బయలుదేరడం.