ఈ విభాగంలో
భారతదేశమంతటా పర్యటించి భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూడడం. తాను నేర్చుకొంటూ, సమాజానికి నేర్పడం.
పరాధీనంలో భారతదేశం బానిసత్వంలో మ్రగ్గడానికీ, దాని అధోగతికీ, తక్కిన సంస్కర్తలు పేర్కొన్నట్లు కారణం మతం కాదు; మతం పేరిట రాజకీయాలూ, మూఢనమ్మకాలూ ప్రబలడమే కారణమని ప్రప్రథమంగా ఎత్తి చూపడం.
నిజమైన మత మార్గంలో భారతదేశం పయనించకుండా, పామరుల స్త్రీల ఉద్ధరణ జరుగకుండా భారతదేశం పురోగమించదని గ్రహించడం.
రాజులను కలుసుకొని పౌరుల దుఃస్థితిని వారి దృష్టికి తెచ్చి వారి బాధ్యతను జ్ఞప్తికి తేవడం.
పామర ప్రజల స్థితిగతులను మెరుగుపరచడానికి తానూ, తన సోదర సన్న్యాసులూ తమ జీవితాలను అంకితం చేయాలని నిశ్చయించుకోవడం.
భారతదేశ ఉద్ధరణ కార్యాన్ని పాశ్చాత్యం నుండే ప్రారంభించాలి, ఎందు కంటే పాశ్చాత్యంలో లేచే ఒక అల సైతం భారతదేశంలో కచ్చితంగా ఆమోదముద్ర పొందుతుందని గ్రహించడం.
భారతదేశానికి మాత్రమే కాదు, తాము లోకమంతటి కోసం ఒక సందేశంతో ఏతెంచినందున పాశ్చాత్య దేశాలను సందర్శించాలని నిశ్చయించుకోవడం.
కన్యాకుమారిలో ధ్యానమగ్నులై సుస్పష్టతను సంతరించుకోవడం.
భారతదేశ పేదల కోసం, భారతీయ ఆధ్యాత్మిక సందేశాన్ని పాశ్చాత్యానికి అందించడం కోసం పాశ్చాత్య దేశాలకు బయలుదేరడం.