మరణమూ కాలమూ
ఈ లోకంలో నిశ్చయమైనది మరణం ఒక్కటే. జననం, ఇది మనలను గడచి వెళ్లిపోయింది. ఇక ఈ విషయంలో మనం చేయడానికి ఏమీ లేదు. మరణం – ఇది మన సమక్షంలో పొంచివుంది. పుట్టిన ప్రతి ఒక్కరూ దానిని ఎదుర్కొనే తీరాలి. కాలమనే మహాయంత్రం పుట్టిన ప్రతి ఒక్కరినీ మరణం వైపుగా ప్రతిక్షణం వేగంగా తోసుకుంటూ వెళుతూ వుంది. అది ఎంత శక్తివంతమయినదో కదా! తన భ్రమణంలో ఎన్నెన్ని మార్పులు తెస్తుందో! ఏదో సామాన్యమయినదిగా, శక్తిహీనమైనదిగా కాలం తన్ను తాను చూపుకొంటుంది. కానీ నిజానికి అదే మానవ జీవితాన్ని ఒక ఖడ్గంలా క్షణం కూడా ఆగకుండా నరుకుతూ వుంది’ అంటూ ఆశ్చర్యచకితుడవుతున్నాడు ఒక మహాపండితుడు. కాలం అనే శక్తివంతమయిన ఈ పరికరాన్ని ప్రకృతి అందరికీ సమంగా పంచియిచ్చింది. ఇంకా చెప్పాలంటే, పరిస్థితి, ఆహారం, గుడ్డలు ఇత్యా దులన్నీ మనిషికీ మనిషికీ భిన్నంగా ఉంటాయి. కానీ కాలం మాత్రం అందరికీ ఒక్కటే. ఈ కాలమనే మాయాపరికరాన్ని సరిగ్గా ఉపయోగించే వ్యక్తికి మరణం సమీపించదు. ఆతణ్ణి మరణంవైపుగా తోసుకుంటూ వెళ్లే శక్తిని కాలం కోల్పో తుంది. ఆతడికి కాలం దాసోహమవుతుంది. ఆతడు కాలాన్ని జయిస్తాడు.
నీటి బుడగలలా కోటానుకోట్ల వ్యక్తులు జన్మించి నిష్క్రమించిన ఈ మానవ చరిత్రలో, ఇలా కాలాన్ని జయించి శాశ్వతంగా నిలచిపోయిన కొందరిని మనం చూడవచ్చు. మనం ఇంతదాకా చూస్తూవచ్చిన చరిత్ర అలాంటి వాటిలో ఒకరిది. అవును, మాతృదేవి కాలాన్ని జయించినవారు, మరణాతీతులు. ఆమె కాశీలో ఉంటున్నప్పుడు ఒక రోజు సురబాల తన మామూలు ధోరణిలో మాతృదేవిని నిందిస్తూ, “నువ్వు చావు; ఎప్పుడు చస్తావోకదా!” అంటూ పదేపదే తిట్టసాగింది. ఇది విన్న మాతృదేవి ప్రశాంతంగా నవ్వుకున్నారు. తర్వాత “పాపం ఈమె, నాకు మరణమే లేదని ఈమెకు తెలియదు” అన్నారు. ఆమె ఈ ఇల నుండి నిష్క్రమించి చాలా సంవత్సరాలు గడచిపోయాయి. కానీ ఈనాటికీ మనం ఆమె స్మృతులను పవిత్రంగా ఆరాధిస్తున్నామంటే ఆమె మనతోపాటు జీవిస్తూన్నారనే కదా అర్థం! రెండు శతాబ్దాలకు ముందు బంకురా జిల్లా పటంలో కూడా చోటు చేసుకోని ఒక కుగ్రామమయిన జయరాంబాటి ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు తరలి వస్తున్న ఒక పుణ్యక్షేత్రంగా రూపొందిందంటే మాతృదేవి ఇప్పటికీ జీవించి ఉండడం వల్లనే కదా!
మాతృదేవి ఆరోగ్యం
కానీ శరీరం నశించిపోవడం ప్రకృతి సిద్ధం. పంచభూతాల నుండి ఉద్భవించిన శరీరం మళ్లీ వాటిలో కలిసిపోయే తీరాలి. ఇది ప్రకృతి నియమం. మాతృదేవి దివ్యశరీరం కూడా ప్రకృతి నియమాన్ని పాటిం చింది. మాతృదేవి 1919 జూలై ఆఖరులో కోల్పారా నుండి జయరాంబాటికి వెళ్లేదాకా, అంటే అరవై ఐదవ ఏటి దాకా ఆమె జీవితాన్ని పరికించాం. ఎంత మహోన్నత తపస్సు! ఎంత మహోన్నత పరిశ్రమ! వ్యాధులు సోకని శరీరం కూడా నలిగిపోతుంది! అలాంటప్పుడు పలు రుగ్మతలతో పోరాడుతూ జీవించిన మాతృదేవి దివ్యశరీరం గురించి ఇక చెప్పాలా? జయరాం బాటి మలేరియాకు నిలయం. చికిత్సకు కనీస సౌకర్యాలు కూడా అక్కడ లేవు. అందువల్ల చిన్నతనం నుండే అప్పుడప్పుడు మలేరియా తాకిడికి గురయ్యారు మాతృదేవి. దానితోపాటు కడుపు నొప్పులు, అతిసారం లాంటి వ్యాధులతో అప్పుడప్పుడు ఆమె బాధపడేవారు. దక్షిణేశ్వరం రోజుల్లో కీళ్లనొప్పులు కూడా మొదలయ్యాయి. ఈ కారణంగా మాతృదేవి తమ జీవిత కాలమంతా కాస్త కుంటు కుంటూనే నడవాల్సి వచ్చింది. దీనిని ఒకసారి మాతృదేవి తమాషాగా పేర్కొన్నారు. భక్తుడొకడు మాతృదేవిని ప్రశంసిస్తూ “అమ్మా! భవిష్యత్తులో అసంఖ్యాక భక్తులు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు” అన్నాడు. అందుకు మాతృదేవి నవ్వుకుంటూనే, “అవునవును! పొట్టిగా కుంటుకుంటూ నడిచే ఒకావిడ ఉండేదని జ్ఞాపకం చేసుకుంటారు” అన్నారు. రాధూ మాతృదేవి జీవితంలో ప్రవేశించిన తర్వాత ఇక చెప్పాల్సింది లేదు; ఆమెను పెంచడానికి పడిన శ్రమ ఆమె ఆరోగ్యాన్ని మరితంగా కృంగదీసింది.
వీటన్నిటికంటే ముఖ్యం మాతృదేవే అప్పుడప్పుడు పేర్కొన్నట్లు, ‘ఇతరుల పాపాలను తీసుకోవడం’. ఈ కారణంగా మాతృదేవి అనుభవించిన శారీరక రుగ్మతలు కోకొల్లలు. కాని వాటికి ఆమె ఎన్నడూ అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. అందుకు మారుగా రాధూ చికిత్సల కోసమే ఆమె ఎంతో కలత చెందారు. అంతేకాక శిష్యులతో, “నా ఆరోగ్యం గురించి శరత్‌కు వ్రాయకండి. మంత్రదీక్షకు వచ్చేవారిని ఆతడు ఆపేస్తాడు” అనేవారు. అలాంటి కరుణాసాగరంగా విరాజిల్లారు మాతృదేవి.
కాలాంతరంలో జ్వరం ఎడతెగకుండా మాతృదేవిని బాధింపసాగింది. 1917 లో ఒకసారి ఆమె కోల్పారాలో ఉన్నారు. అప్పుడు ఒక రోజు వడగళ్ల వానపడింది. దానిని పట్టించుకోకుండా ఆ వానలో తడుస్తూ, మంచుగడ్డలను ఏరుకుంటూ వాటితో ఆకృతులు చేస్తూ పిల్లలతో తాము కూడా చిన్నపిల్లగా ఆడుకుని ఆనందించారు. పర్యవసానం? జ్వరం ఉద్ధృతమయింది. ఎలాంటి చికిత్సా పనిచేయలేదు. స్వామి శారదానంద వైద్యులను తోడ్కొని వెంటనే వచ్చారు. అదృష్టవశాత్తు అప్పుడు మాతృదేవి కోలుకున్నారు.
పుట్టింటికి వీడ్కోలు
ఇప్పుడు కోల్పారా నుండి వచ్చిన తర్వాత మాతృదేవి ఆరోగ్యం ఆందోళన కరంగా తయారయింది. అప్పుడప్పుడు జ్వరం రావడం మొదలయింది. అక్కడ వైద్యులు ఏమీ చేయలేకపోయారు అందువల్ల మాతృదేవిని ఉద్బోధన్ ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించారు స్వామి శారదానంద. ఫిబ్రవరి 24వ తేది మంగళవారం మాతృదేవి బయలుదేరేటట్లు ఏర్పాట్లు చేశారు. సెలవు తీసుకోవాలనే ఉద్దేశంతోనో ఏమో బయలుదేరడానికి ఒకటి రెండు రోజులకు ముందు మాతృదేవి సింహవాహిని ఆలయానికి వెళ్లారు. వెళ్లి రావడంలో బాగా ఆయాసపడ్డారు. బయలుదేరే రోజు ఉదయం పుణ్యపుకూర్ కొలను మెట్లపై కాలుజారి కిందపడ్డారు. ఇలా ఆరు నెలలు అలసిపోయిన స్థితిలో జయరాంబాటిలో నివసించిన తర్వాత మాతృదేవి కలకత్తాకు బయలుదేరారు. ఆమెతోపాటు ఎప్పటిలా రాధూ, సురబాల, మాకూ, నళిని, బ్రహ్మచారి వరద, ఒకరిద్దరు భక్తులు వెళ్లారు.
మాతృదేవి బయలుదేరుతున్న దృశ్యం చూపరుల హృదయాలను ద్రవింపచేసింది. తను పుట్టిన చోటినుండి చివరిసారిగా సెలవు తీసుకుంటున్నట్లు మాతృదేవి కూడా గ్రహించివుంటారు. మాతృదేవి బయలుదేరేటప్పుడు ఆ కుగ్రామ ప్రజలందరూ ఆమెను చుట్టుముట్టారు. అన్ని రోజులు నీడనిచ్చి, కన్నతల్లికంటే ఆప్యాయానురాగాలతో మెలగిన మాతృదేవి ఇప్పుడు నడవలేకుండా డస్సిపోయి ఊరువదలి వెళ్లిపోతున్నారు. ఈ దృశ్యాన్ని కల్లాకపటంలేని గ్రామ ప్రజలు భరించలేకపోయారు. వారి కళ్లు ధారలుకట్టాయి. “అమ్మా! మమ్మల్ని మరచి పోకండి. వ్యాధి నయంకాగానే వచ్చేయండి” అంటూ గద్గద స్వరంతో ప్రార్థించారు. మాతృదేవి తాము పూజిస్తున్న గురుదేవుల పటాన్ని ఒక గుడ్డతో చుట్టిపెట్టెలో భద్రపరచుకున్నారు. “అంతా గురుదేవుల ఇచ్ఛానుసారం జరుగుతుంది. నేను మిమ్మల్నందరిని ఎలా మరచిపోగలను?” అన్నారు. తర్వాత లేచి తలుపు దాటి బయటికి వచ్చారు.
ఆ తర్వాత గ్రామ ఆరాధ్య దేవతలయిన సింహవాహిని, ఇతర దేవతలను పేరుపేరున పిలిచి నమస్కరించారు. పిదప నెమ్మదిగా నడవసాగారు. ప్రసన్నుని భార్య దారిలో తన ఇంటి ముందు మాతృదేవి పాదాలను కడిగి ఆరాధించడానికి తయారుగా నిలబడింది. ఆ పని పూర్తికాగానే కొంత తీపి తిని నీరు త్రాగారు. సింహవాహిని మొదలైన దేవతలు వెలసి ఉండడంవల్ల ఊరి పొలిమేర దాకా పల్లకీ వద్దని నడుస్తూనే వెళ్లారు. దారిలో యాత్రాసిద్ధిరాముని కూడా ఆరాధించి సెలవు పుచ్చుకొన్నారు. చేతులు జోడించి నమస్కరిస్తూ చాలాసేపు నిలబడిపోయారు. తర్వాత పల్లకీ ఎక్కి కూర్చోగానే, పల్లకీ బయలుదేరింది. గ్రామస్థులు అక్కడి వరకూ వచ్చి కన్నీటితో మాతృదేవికి వీడ్కోలిచ్చారు.
జయరాంబాటిని మాతృదేవి ఎంతగానో ప్రేమించారు. తాము నిష్క్రమించిన తర్వాత తమ అసంఖ్యాక సంతానం అక్కడికి రానున్న విషయం ఆమెకు తెలియంది కాదు. అందువల్లనే ఒక రోజు స్వామి శారదానందతో, “నాయనా! నేను వెళ్లిపోయిన తర్వాత నన్ను వెతుక్కుంటూ నా సంతానం ఎందరో ఇక్కడికి వస్తారు. అలా వచ్చే వారికి ఆహారం, విశ్రాంతి ఏర్పాట్లు చేయించు” అంటూ చెప్పారు కూడా!
రాత్రి బాగా ప్రొద్దుపోయాక మాతృదేవి కోల్పారా చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే బస చేశారు. మర్నాడు ఉదయం అక్కణ్ణుండి బయలుదేరారు. అప్పుడు నమస్కరించిన అందరినీ మాతృదేవి హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. తాము ఉంచుకున్న చేతి కర్రను, దోమతెరను బ్రహ్మచారి గగన్‌కు ఇస్తూ, “ఇవి ప్రసన్నుడివి, వాడికి ఇవ్వు” అన్నారు. పుట్టింటి వస్తువులు తమ వద్ద ఉండకూడదని అనుకున్నారో ఏమో! మాతృదేవి మనస్సును అర్థం చేసుకున్నందువల్లనో, ఆమె ప్రేమలో కరిగిపోయినందువల్లనో గగన్ కళ్లు ఆర్ద్రమైనాయి. అది చూసి మాతృ దేవి, “కలత చెందకు నాయనా! శరత్ ఉన్నాడు కదా! మిమ్మల్ని చూసుకుంటాడులే!” అన్నారు.
కోతూల్పూర్ మీదుగా ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అందరూ విష్ణుపూర్ చేరుకున్నారు, అక్కడ సురేశ్వర్ సేన్ అనే భక్తుని ఇంట బసచేశారు. మర్నాడు అక్కడనుండి రైలులో కలకత్తాకు బయలుదేరారు. ఫిబ్రవరి 27, శుక్ర వారం రాత్రి 9 గంటలకు రైలు కలకత్తా చేరుకుంది.
ఉద్బోధన్లో
కలకత్తా రైలు నిలయంలో మాతృదేవిని ఆహ్వానించడానికి యోగిన్ మా, గోలాప్ మా ఇంకా పలువురు భక్తులు వచ్చారు. బాగా చిక్కిపోయి, నల్లబడి బండి నుంచి దిగిన మాతృదేవిని చూసి అందరూ చెప్పలేని ఆవేదనకులోనై, “ఇదేం ఘోరం! మీరు మాతృదేవినా తీసు కొచ్చారు? ఎముకలు, చర్మంగా ఒక నల్లని కట్టెలా కదా కనబడుతున్నారు!” అంటూ వారందరూ విస్మయంతో హాహాకారాలు చేశారు. తర్వాత అందరూ కలిసి ఉద్బోధన్ చేరుకున్నారు.
చికిత్సలు
గత కొన్ని నెలలుగా మాతృదేవి భయంకరమైన జ్వరంతో బాధపడ్డారు. ఆమె కలకత్తా చేరుకున్న రోజు నుండే చికిత్సకోసం చక్కని ఏర్పాట్లు చేశారు స్వామి శారదానంద. మొదట్లో హోమియోపతి చికిత్స చేయించారు. డాక్టరు కంజీలాల్ చికిత్స చేశాడు. రెండు వారాలు దాటినా ఎలాంటి ప్రయోజనమూ కనిపించలేదు. ఆ తర్వాత ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడయిన శ్యామాదాసును పిలిపించారు. ఆయన చికిత్స మాతృ దేవికి కొంత ఉపశమనం కలిగించింది. కానీ ఆతడు ఇచ్చిన మందు మరీ చేదుగా ఉండడంతో రోజంతా పూర్తిగా మాతృదేవి మరేదీ తినలేకపోయారు. కానీ మాతృదేవి వ్యాధికి ఆ మందు తప్ప మరొకటి ఆతని వద్దలేదు. అందువల్ల అలోపతికి (ఇంగ్లీషు వైద్యం) మార్చారు. ప్రసిద్ధుడైన డాక్టరు బిపిన్ బిహారీ ఘోష్‌ను పిలిపించారు. ఆయన ఒక నెల చికిత్స చేశాడు. తర్వాత ఆతని సలహా మేరకు మరొక ఘన వైద్యుడయిన ప్రదాన్బోస్తోపాటు ఒకరిద్దరు డాక్టర్లను కూడా చికిత్సకు రప్పించారు. కానీ ఎలాంటి ప్రయోజనమూ లేదు. మాతృదేవి జ్వరం తమ చికిత్స హద్దును దాటడం చూసిన వైద్య నిపుణులు, ఆ వ్యాధిని బాగా అధ్యయనం చేసి, అది ఎండలు ఎక్కువగా వున్న చోట్ల వచ్చే మలేరియా లాంటి ఒక భయంకరమైన జ్వరంగా కనుగొన్నారు.* ఆ రోజుల్లో ఆ వ్యాధికి చికిత్స ఏదీ కనుగొనలేదు. అలోపతి వైద్య నిపుణులు నిస్సహాయులయ్యారు. అందువల్ల మునుపటిలా హోమియోపతి, ఆయుర్వేద చికిత్సలు కొనసాగాయి. ఈ మూడు రకాల చికిత్సలతోపాటు శాంతి, స్వస్థ్యయనం లాంటివి* కూడ ఏర్పాటు చేశారు స్వామి శారదానంద. కానీ మాతృదేవిని పట్టుకున్న జ్వరం మాత్రం తగ్గలేదు.
ప్రారంభంలో జ్వరం సాయంత్రాలలో మాత్రమే వచ్చేది. రాత్రికి తగ్గి పోయేది. ఆ తర్వాత జ్వరం ఉదయం, సాయంత్రం రాసాగింది; కొన్ని సమ యాల్లో ఉష్ణోగ్రత 103 ఉండేది, ఇంకా ఎక్కువైనప్పుడు మాతృదేవి స్పృహ కోల్పోయేవారు. ఇందుకు తోడు శరీరమంతటా భరించలేని మంటలు. ఈ మంటలు తీవ్రమైనప్పుడు, “ఏ కొలను కైనా వెళ్లి మునిగి పడివుండాలని అని పిస్తుంది” అనేవారు. ఆ మంటలు తగ్గడానికి సదాసర్వవేళలా ఒకరు పక్కన నిల బడి విసనకర్రతో వీస్తూ ఉండాలి. లేకపోతే మంచుగడ్డను ఒక వ్యక్తి తన చేతు లతో తాకిన తర్వాత ఆ చేతులను వారి శరీరంపై ఉంచేవాడు. మంచుగడ్డ లభిం చకపోతే వేడి తక్కువగావున్న మరొక వ్యక్తి శరీరంపై తమ చేతిని ఉంచుకునేవారు మాతృదేవి.
ముడతలుపడ్డ దేహంలో ప్రకాశించే మాతృత్వం
మాతృదేవికి రెండు కోవలవారు సేవలు చేశారు. సాధువులూ బ్రహ్మ చారులూ వైద్యులను తోడ్కొని రావడం, ఆహారం మందులు ఇత్యాదులు కొనడం, జావవంటివి వండడం, వీవన చేయడం లాంటి పనులు చేసేవారు. ఆహారం తయారు చేయడం, గుడ్డలు ఉతకడం, పరుపును శుభ్రం చేయడం, ఆహార మివ్వడం లాంటి వాటిని భక్తులు చేసేవారు. తాము మంచం పట్టి ఇన్ని బాధలు అనుభవిస్తున్నా అందరినీ ఎంతో ప్రేమతో చూశారు మాతృదేవి. దానితోపాటు తమను చూడవచ్చిన భక్తుల శిష్యుల శ్రేయస్సును గురించి ఆప్యా యంగా విచారిస్తూ, వారికి తినడానికి తప్పకుండా ఏదో ఇప్పించేవారు. పరీక్షించ డానికి వచ్చిన డాక్టరులకు కూడా గురుదేవుల ప్రసాదమైన పండ్లు, తీపి పదా ర్థాలు పంచిపెట్టే విషయంలో ఎంతో శ్రద్ధ చూపేవారు. శరీరంలో చెలరేగిన మంటలతో మాతృదేవి బాధపడుతూవుండడం వల్ల భక్తులు ఆమె ప్రక్కనే నిలబడి విసనకర్రతో విసిరేవారు. ఆ మంటలకు కొంత ఉపశమనం కలిగేది. కానీ చాలా సేపు విసరడానికి ఎవరినీ అనుమతించరు. తమ బాధను కూడా సహిస్తూ, “నాయనా! నీ చేతులు నొప్పిపుడతాయి, విసిరింది చాలు” అనేవారు. కానీ అలాగే విసుతూవుంటే, “నాయనా! నీ చేతులు నొప్పిపుడతాయనే ఆలోచనతో నేను నిద్ర పోలేకున్నాను. ఇక చాలు, ఆపు” అనేవారు. ఇక గత్యంతరంలేక విసరడం ఆపేసేయాల్సి వచ్చేది.
ఒక రోజు శిష్యుడొకడు రమణి అనే స్త్రీ ద్వారా మాతృదేవికి తాటి పండు పంపించాడు. ఆమె ఉద్బోధన్కు వచ్చినప్పుడు మాతృదేవి జ్వరంతో స్పృహతప్పిన స్థితిలో పడుకునివున్నారు. స్పృహ రాగానే ఆమె వచ్చి వెళ్లిన విషయం విని ఎంతో ఆవేదనతో, “ఆహా! ఎంతదూరం ప్రయాణం చేసి జయరాంబాటి నుండి ఆమె కలకత్తాకు వచ్చింది! ఆమెను చూసి ఒక్కమాట కూడా మాట్లాడలేకపోయానే! నేను ఎంతో నొచ్చుకున్నట్లు ఆమెకు తెలియబరచండి” అన్నారు.
ఒక రోజు రాంలాల్తోపాటు లక్ష్మీదేవి కూడా మాతృదేవిని చూడడానికి వచ్చింది. వాళ్లు తిరిగి వెళ్లేటప్పుడు ఏదైనా ఇవ్వడం మరచిపోయారు మాతృదేవి. అందుకోసం తర్వాత చాలా బాధపడ్డారు. ఒక వ్యక్తి ద్వారా గుడ్డలు, రెండు రూపాయలు వాళ్లకు పంపించిన తర్వాత ఆమె స్థిమితంగా ఉండగలిగారు.
ఈ భయంకరమైన జ్వరంతో ఉన్నప్పుడు జావ, పాలు, పథ్యాహారం, కొన్ని రకాల పండ్లు మాత్రమే మాతృదేవికి ఇచ్చారు. సామాన్యంగా అప్పుడు ఆమె శరీరంలో రక్తహీనత మొదలయింది. అందువల్ల రక్తవృద్ధికి సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను ఇవ్వమని ఆయుర్వేద వైద్యుడు తెలిపాడు. మాతృదేవికి సరళ అనే శిష్యురాలు ఆహారం తినిపించేది. ఒక రోజు ఆమె మాతృదేవికి ఆహారం తీసుకుకెళ్లినప్పుడు హోమియోపతి వైద్యుడయిన కంజీలాల్ వచ్చాడు. ఆహార పరిమాణాన్ని చూసి ఆతని ముఖం మారిపోయింది. మాతృదేవి ఎక్కువగా ఆహారం తీసుకోవడం మంచిది కాదని ఆతడు భావించాడు. అందువల్ల ఎక్కువగా ఆహారం ఇస్తున్నందుకు సరళను గట్టిగా తిట్టాడు. ఇకపై ఆమె మాతృదేవిని చూసుకోనక్కర్లేదనీ, అందుకు ఇద్దరు నర్సులను పంపిస్తున్నట్లూ చెప్పాడు. డాక్టరు వెళ్లిపోగానే మాతృదేవి సరళను స్వాంతనపరుస్తూ, “కంజీలాల్ అర్థం లేకుండా కోపగించుకొన్నాడు. నేను తింటున్నాననే కదా నువ్వు తెస్తున్నావు! ఆతను నర్సు లను పంపిస్తానన్న విషయం గురించి కంగారు పడకు! ఆ ‘బూట్స్’ వేసుకున్న స్త్రీలను నా ప్రక్కకే రానివ్వను” అన్నారు. ఈ సంఘటన తర్వాత తినాలనే కించిత్తు కోర్కెకూడా మాతృదేవికి లేకుండాపోయింది.
శారందానందకు
దీర్ఘకాల వ్యాధితో మాతృదేవి నైజం ఒక పసిబాలిక లాంటిదిగా మారి పోయింది. గంగానదికి వెళ్లాలని అప్పుడప్పుడు ఆమె అనేవారు. తీసుకు వెళతా నని ఎవరైనా చెప్పే దాకా ఏమీ తినరు. అంతేకాక ఆమెకు ఆహారం ఇవ్వడం కూడా చాలా ఇబ్బందిగా కృపాకటాక్షం తయారయింది. ఆహారం తీసుకోనని హఠం పట్టినప్పుడు శారదానందను పిలుస్తామని చెబితే మాత్రం, “నా అబ్బాయిని ఎందుకు ఇబ్బంది పెడతావు?” అంటూ ఆహారం తినేసేవారు.
ఒక రోజు, రాత్రి బాగా ప్రొద్దుపోయింది. సరళ ఎంత ప్రయత్నించినా మాతృదేవి పసిబిడ్డలా ఆహారం తిననని మంకుపట్టుపట్టారు. “ఎప్పుడు చూసినా తిను, తిను అని చెప్పడం; అది కాగానే ఆ కొయ్యముక్కను* నా చంకలో ఉంచడం, ఇదే నీ పని. ఇంతకంటే నీ కేమీ తెలీదు” అంటూ ఎంత చెప్పినా ఆహారం తిననని మొండిపట్టుపట్టారు. ఇక గత్యంతరంలేక శారదానందను పిలు స్తున్నట్లు సరళ చెప్పింది. కానీ ఈసారి ఆ అస్త్రం కూడా పని చేయలేదు. “పిలువు! నీ చేతులలో నేను తినను, తిననే తినను” అంటూ దృఢంగా చెప్పేశారు. చివరకు క్రింద ఉంటున్న శారదానందను పిలిపించింది సరళ. స్వామి మేడమీదికి వచ్చారు. ఆయన రాగానే మాతృదేవి ఆశ్చర్యపరచే తీరులో ప్రవర్తించారు.
ఆ రోజు దాకా తన ముఖాన్ని కప్పుకోకుండా మాతృదేవి శారదానంద సమక్షంలో ఉన్నది లేదు. ఆయనతో సూటిగా మాట్లాడరుకూడా, ఎవరి మూలంగానైనా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఆయనను తన దగ్గరకు రమ్మని పిలిచి, తమ పక్కన కూర్చోపెట్టుకున్నారు. ఆయన చుబుకాన్ని ఆప్యాయంగా స్పృశించి ముద్దుపెట్టుకుని, ఆయన రెండు చేతులను తమ చేతులలో పెట్టుకుని, చిన్న బిడ్డలా సరళను చూపిస్తూ, “నాయనా! ఈమె నన్ను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతూవుందో తెలుసా? ఎప్పుడు చూసినా తినూ తినూ అంటూ నా ప్రాణాలు తీస్తుంది. ఆ తరువాత ఒక చిన్న కొయ్య ముక్క తీసుకుని నా చంకలో ఉంచి తీస్తుంది. నన్ను ఇలా హింస పెట్టవద్దని ఆమెకు చెప్పు నాయనా!” అన్నారు. స్వామి వెంటనే, “అమ్మా! ఇకపై ఆమె ఇలా చేయరు” అంటూ అనున యించారు. కొంత సేపయిన తర్వాత, “అమ్మా! రాత్రి ఇంత ప్రొద్దుపోయిందే, ఏదైనా కొంచెం ఆహారం తీసుకోవచ్చు కదా!” అంటూ ఆప్యాయంగా అడిగారు. మాతృదేవి కూడా ‘సరే’ అంటూ తలూపారు. వెంటనే స్వామి, సరళతో మాతృ దేవికి ఆహారం తినిపించమన్నారు. మాతృదేవి ఆమెను వారిస్తూ, “వద్దు, వద్దు! ఆమె ఇవ్వవద్దు. నువ్వే నీ చేతుల్తో తినిపించు” అన్నారు. స్వామి మాతృదేవికి కాస్తకాస్తగా పాలు త్రాగించారు. తర్వాత పాల పాత్రను క్రిందవుంచి, “అమ్మా! ఇప్పుడు యిది చాలు, కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత తినవచ్చు” అంటూ ఆప్యాయంగా చెప్పారు. ఈ మాటలు విని మాతృదేవి ఎంత సంతో షంతో సరళను, ఇతరులను చూస్తూ, “నా కుమారుడు ఎంత ప్రేమగా మాట్లాడు తున్నాడు – ‘అమ్మా! కొంతసేపు విశ్రాంతి తీసుకోండి. తర్వాత ఆహారం తీసుకో వచ్చు’ – మీ అందరికీ ఎందుకు ఇలా మాట్లాడ్డం రాదు? ఎప్పుడు చూసినా తినండి, తినండి – ఈ మాటలే అంటూవుంటారే” అన్నారు. తర్వాత శారదా నందను చూసి, అత్యంత ప్రేమతో, “నాయనా! నువ్వు రోజంతా పనిచేసేవాడవు. ఈ అర్ధరాత్రి నిన్ను పిలిచి ఇబ్బంది కలిగించేశారు. వెళ్లి విశ్రాంతి తీసుకో. నా కోసం నువ్వెంత శ్రమ తీసుకున్నావు!” అన్నారు.
గడచిన సుమారు ఇరవై ఏళ్లుగా మాతృదేవి బాధ్యతలను వహించి, వారి అవ్యాజప్రేమకు పాత్రుడయిన స్వామి శారదానంద మనసులో ఒక కొరత వేధిస్తూనే ఉంది. మాతృదేవికి ప్రత్యక్షంగా పరిచర్యలు ఏవీ చేయ లేకుండా పోయానే అనే బాధే అది. సహజమైన సిగ్గు వల్ల ఆయన తానుగా దానిని చేయ లేదు. అందరి మనస్సులలోని ఆకాంక్షలను ఎరిగి నెరవేర్చే కరుణా సాగరమైన మాతృదేవి స్వామి శారదానంద కోర్కెను కూడా ఇలా నెరవేర్చారు. “నా మనస్సు లోని దుఃఖాన్ని పోగొట్టడానికే మాతృదేవి నా సేవలను స్వీకరించారు” అంటూ తర్వాత శారదానంద అన్నారు.
శారదా మఠానికి బీజం
అది సరే, మాతృదేవి తనను త్రోసి రాజనడాన్ని సరళ ఎలా సహింప గలిగింది? తాను మాతృదేవికి ఇబ్బందిగా ఉండకూడదనుకొని ఆమె శారదానంద వద్దకు వెళ్లి తన పనిని మార్చుకుంది; “ఆహారం ఇవ్వడం లాంటి యితర పనులు నేను చూసుకుంటాను. కానీపాలు తాగించడం, జ్వరం చూడడం లాంటివి ఇతరులు చేయనీ!” అని చెప్పింది. శారదానంద కూడా అందుకు సమ్మతించారు. మర్నాడే మాతృదేవి ఈ విషయం అర్థం చేసుకున్నారు. సరళ బయటికి వెళ్లి సర్వాంతర్యామి వున్నప్పుడు, ఒక శిష్యురాలితో, “ఏమిటి! సరళ నాపై కోపగించుకొని వెళ్లి పోయిందా?” అని అడిగారు. అందుకు ఆ శిష్యురాలు, “ఎందుకమ్మా! ఆమె మీపై ఎందుకు కోపగించుకోవాలి?” అంది. అందుకు మాతృదేవి, “లేదు, లేదు, ఆమెకు నామీద కోసమే!” అన్నారు. కొంత సేపట్లో సరళ వచ్చింది. మాతృ దేవి ఆమెను ప్రేమతో పిలిచి, ఆప్యాయం ఉట్టిపడే స్వరంలో, “అమ్మాయీ! నా మీద కోపమా?” అని అడిగారు. “నే నెందుకు మీమీద కోపగించుకోవాలి?” అంది సరళ. అందుకు మాతృదేవి, “కోపం లేకపోతే నువ్వు నాకు పాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఆ కొయ్యముక్కను నా చంకలో ఎందుకు ఉంచవు? అమ్మాయీ! ఈ వ్యాధి ఎడతెగని మంటలు కల్పిస్తూంది. కొన్ని సమయాల్లో ఏదో ఆలోచిస్తూ మాట్లాడేస్తాను. నా మాటలను అంతగా పట్టించుకోవద్దు” అన్నారు. అలా అంటూ మాతృదేవి ఆమె తలను తనవైపుగా లాక్కొని తమ హృదయానికి హత్తుకుని అత్యంతప్రేమతో తల నిమిరారు. మాతృదేవి అవ్యాజ ప్రేమను చవిచూసి సరళ భోరున ఏడ్చింది.
మాతృదేవికి సరళ పట్ల ఒక ప్రత్యేకమయిన అనురాగం ఉంది. ప్రత్యేకంగా ఆమె ఆధ్యాత్మిక జీవితం పట్ల మాతృదేవి ఎంతో శ్రద్ధ చూపించారు. ఎందుకంటే ఈ సరళ భవిష్యత్తులో రామకృష్ణ ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన పాత్ర వహించనున్నదని ఆమె ఎరిగివున్నారు. అందువల్ల అందుకు తగ్గట్లు ఆమెకు తర్ఫీదు నిచ్చారు. ఒక రోజు దానిని గురించి ఆమెతో చెప్పారు కూడా! మాతృదేవి ఇక ఎక్కువ రోజులు జీవించరని గ్రహించిన సరళ ఒక రోజు ఏడుస్తూ మాతృ దేవితో, “అమ్మా! మీరు లేకుండా నేను జీవించలేను. నన్ను కూడా మీతోపాటు తీసుకెళ్లండి” అంది. అందుకు మాతృదేవి ఎంతో ప్రశాంతంగా, “అమ్మాయీ! చివరకు నువ్వు నా వద్దకు వస్తావు; నా దగ్గరకే వచ్చి చేరతావు; కానీ నీ ద్వారా నేను చేయవలసిన కార్యం కొద్దిగా మిగిలివుంది. దానిని నువ్వు పూర్తి చేశాక నా వద్దకు రావచ్చు” అన్నారు. మాతృదేవి ఈ మాటలు సుమారు ముప్పై సంవత్స రాల తర్వాత జరగనున్న చరిత్రలో ముఖ్యత్వం పొందిన ఒక కార్యం కోసమైన బీజం సుమా! రామకృష్ణ మఠంలా స్త్రీల కోసమైన సంస్థయైన శారదామఠ స్థాపననే మాతృదేవి అలా పేర్కొన్నారు. శారదా మఠ కాలాంతరంలో స్థాపింపబడి నప్పుడు సరళ ప్రవ్రాజిక భారతీప్రాణా పేరుతో ఆ సంస్థ ప్రప్రథమ అధ్యక్షురాలిగా బాధ్యత వహించింది. సంఘ జననిగా, గురుదేవియైన మాతృదేవి, అందులో స్త్రీలకు కూడా తగిన చోటును ఇలా కల్పించారు.*
మాయ, మహామాయ
ఇక? ఇక ఏమిటి? వచ్చిన పని అయిపోగానే తిరిగి వెళ్లవలసిందే కదా! ‘ఎక్కడో ఆకాశంలో నెలకొన్న చంద్రుని ప్రతిబింబం కొలను నీటిలో ప్రతిఫలి స్తుంది. చేపలు ఆ ప్రతిబింబాన్ని తమలో ఒకటిగా భావించి దానితో ఆడుకుంటున్నాయి. కానీ దాని నిజమైన వాసస్థానం ఏదో పాపం ఆ చేపలకు తెలియదు. ఉదయమయ్యేసరికి ఆ బింబం కనుమరుగైపోతుంది’ – తమ దివ్యత్వాన్ని సూచించడానికో అన్నట్లు మాతృదేవి కొన్ని సమయాల్లో ఇలా చెప్పేవారు. ఇప్పుడు ఈ బింబం కూడా కనుమరుగవ్వా ల్సిందే. అలా అయితే ప్రాతఃకాలం రావాలి. ప్రాతఃకాలం రావాలి అంటే, చీకటి తొలగిపోవాలి. లోకంలో తమ పనులకోసం చీకటి అయిన మాయతో మాతృదేవి తమను పెనవేసుకున్నారు. ఇప్పుడు పనులన్నీ నెరవేరిన తరుణంలో మాయను త్రోసిపుచ్చాల్సిందే. కాశీలో ఒకసారి మాతృదేవిని రాధూ తదితర కుటుంబం వారితో చూసిన ఒక స్త్రీ, “అమ్మా! ఇదేమిటి! మీరు ఇలా మాయలో చిక్కువడి వున్నారే?” అని అడిగింది. అందుకు మాతృదేవి, “ఏం చేయడమమ్మా! మహా మాయనుకూడా నేనే కదా!” అన్నారు హీనస్వరంలో. మహామాయ అయిన ఆమెతోపాటు మాయ తప్పక వుంటుంది కదా! కానీ మునుపు మనం చూసినట్లు అది ఆమె చేతిలోని పరికరం; కావలసినప్పుడు ఉపయోగించుకుంటారు, అవ సరం లేనప్పుడు దూరంగా ఉంచేస్తారు. ఇప్పుడు దూరంగా ఉంచాలని సంకల్పిం చారు. దాని సూచనలు మే నెలాఖరులో కనబడసాగాయి.
మనస్సు ఉపసంహరణ
దక్షిణేశ్వర రోజులలోనే మాతృదేవికి సేవకునిగా లాటు వ్యవహరించాడు. గురుదేవుల నిర్యాణానంతరం స్వామి అద్భుతానంద పేరిట వరాహనగర మఠంలో ఇతర సన్న్యాసులతోపాటు ఉంటూ సాధనలు అనుష్ఠించాడు. ఒకసారి ఆయన బలరాంబోసు ఇంట్లో ఉంటున్నప్పుడు మాతృదేవి కూడా అక్కడ ఉన్నారు. ఒక రోజు మాతృదేవి బయలుదేరడానికి సంసిద్ధులయ్యారు. అప్పుడు ఒక వ్యక్తి అద్భుతానంద వద్దకు వచ్చి మాతృదేవి బయలుదేరుతున్న విషయం చెప్పాడు. అందుకాయన, “వెళ్లనీ! నేను సన్న్యాసి, నాకు అమ్మా లేదు, నాన్నా లేడు” అన్నారు. తాము బయలుదేరేటప్పుడు స్వామి అద్భుతానంద కనబడకపోవడంతో మాతృదేవి ఆయనను గురించి అడిగారు. అప్పుడు అద్భుతానంద చెప్పిన మాటలు మాతృదేవికి చెప్పారు, వెంటనే మాతృదేవి, “ఆతనికి అమ్మలేకుండా ఉండవచ్చు. కానీ నాకు తనయుడున్నాడు కదా!” అంటూ తామే స్వయంగా ఆతణ్ణి చూడడానికి వెళ్లారు. దీనిని ఏమాత్రం ఎదురుచూడని అద్భుతానంద హడలిపోయి మాతృదేవి పాదారవిందాలకు ప్రణమిల్లాడు. మాతృదేవి ఇలాంటి పుత్రప్రేమకు పాత్రమయినవాడు లాటూ. ఆయన మాతృదేవి చివరి రోజుల్లో ఏప్రెలు 24 వ తేది మహాసమాధి అయ్యారు. ఆ తరువాత మే 14 వ తేది బలరాం బోసు తనయుడయిన రామకృష్ణ బోస్ మరణించాడు. క్షీణించిన ఆరోగ్యం దృష్ట్యా మాతృదేవికి ఈ సంగతి తెలుపలేదు. కానీ గోలాప్ మా తమ మామూలు ధోర ణిలో ఒక రోజు ఆ విషయాలనన్నీ చెప్పేశారు. దాని పర్యవసానం! ఆ రోజంతా మాతృదేవి విలపిస్తూనే ఉన్నారు, రాత్రి కూడా నిద్రపోలేదు. అందువల్ల జ్వరం ఉద్ధృ తమై మాతృదేవి స్పృహ కోల్పోయే స్థితికి వెళ్లిపోయారు.
ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. ఎవరైనా చనిపోతే మాతృదేవి విలపించడం కొత్తవిషయమేమీ కాదు. కానీ అందరినీ ఆశ్చర్యంలో ముంచింది మాతృదేవి తమ తమ్ముడయిన వరదప్రసన్నుని మరణ వార్తను స్వీకరించిన తీరు. ఆయన నిమోనియా కారణంగా జయరాంబాటిలోనే మంచం పట్టివున్నారు. ఈ విషయం మాతృదేవికి తెలుసు. అప్పుడప్పుడు, “వరదుడు ఎలా ఉన్నాడు?” అని అడిగేవారు. రామకృష్ణ బోస్ మరణించిన ఒక వారం తర్వాత వరదుడు మరణించాడు. ఈ విషయం కూడా మాతృదేవికి చెప్పలేదు. కానీ అత్యంత ఆశ్చర్యకర విషయమేమంటే వరదుడు మరణించిన మర్నాడు మాతృదేవి ప్రశ్నించిన తీరు విభిన్నంగా ఉంది. “ఏమిటి! వరదుడు చనిపోయినట్లున్నాడే! ఆ వసారాలో నిలబడి నన్నే చూస్తున్నట్లు చూశాను” అని మామూలుగా అన్నారు. ఆ తర్వాత నిజం చెప్పవలసివచ్చింది. మాతృదేవి కాసేపు విలపించారు. అంతే, ఆ తర్వాత దానిని గురించి కలత చెందినట్లే కనిపించలేదు. ఒకటి రెండు రోజుల తర్వాత బ్రహ్మచారి గోపేష్తో, “ఓ గోపేష్! నీకు విషయం తెలుసా! వరదుడు చనిపోయాడు” అంటూ ఎవరో అపరిచిత వ్యక్తిని గురించిన విషయంలా చెప్పారు. గోపేష్ కలత చెందాడు. తన ప్రియమైన తమ్ముని మరణ వార్తను ఇలా ఎలాంటి నిర్లిప్తతతో చెప్పగలుగుతారని ఆతడు ఊహించలేదు. అందువల్ల ఏమిటా అంటూ ఆమె ముఖాన్నే చూడసాగాడు. వెంటనే మాతృదేవి ఇంకా స్పష్టంగా, “అర్థమవలేదా? అతనే, క్షుది తండ్రి చనిపోయాడు” అన్నారు. “మరణ సందేశం కలిగించిన కలతకంటే నా వరకు నన్ను అత్యంత కలవరపరచింది మాతృదేవి మాటలే. వాటిలో శోకమో ఆవేదనో లేశమాత్రం కూడా కనబడలేదు” అని వ్రాశాడు గోపేష్, 1 మాతృదేవి తమ మనస్సును లోకం నుండి ఉపసంహరించుకోవడం మొదలుపెట్టారనడానికి ఈ సంఘటన మొదటి సూచన. ఈ తర్వాత ఆమెమాటలు, చేతలు ఈ మనోస్థితిని ప్రతిఫలించాయి.
గౌరీమా గంగానదిలో స్నానం చేసి తిరిగి వెళ్లేటప్పుడు రోజూ వచ్చి మాతృదేవిని దర్శించుకొనేది. ఆమె ప్రక్కన కొంతసేపు కూర్చొని యోగక్షేమాలు విచారించేది. అట్లే ఇప్పుడు కూడా వచ్చింది. కానీ ఆ రోజు ఆమె లోపలికి రాగానే మాతృదేవి, “రోజు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇబ్బందిపెడుతున్నావు? ఎందుకు వస్తున్నావు? దేనిని చూడడానికి వస్తున్నావు?” అని కాస్త కటువు అడిగారు. మాతృదేవి ప్రశ్నలతో హడలిపోయిన గౌరీ మా, “అమ్మా! మీరు మంచంపట్టివున్నారు. మేమెలా స్థిమితంగా ఉండగలం? ఎప్పుడూ మీ దగ్గరే ఉండగోరుతున్నాం. కానీ తీరిక దొరకడం లేదు. అందువల్లే రోజు ఒక్కసారైనా వచ్చి వెళుతున్నాను” అంటూ మెల్లగా చెప్పింది. కానీ మాతృదేవి అదే ధోరణిలో, “నా వద్దకు రావడం వల్ల ప్రయోజనమేమిటి? ఎవరి సమస్యలనూ వినే స్థితిలో ఇకలేను” అంటూ నిష్కర్షగా అన్నారు. తర్వాత కాస్త శాంతించి, “అలా వచ్చినా కూడా నా గదిలోపలికి రాకు. తలుపు దగ్గర నిలబడే చూచి వెళ్లిపో! నన్ను మాట్లాడనివ్వకు!” అన్నారు. గౌరీమా ఇక ఏం చేస్తుంది? కన్నీళ్లను ఆపుకోలేక బరువెక్కిన హృదయంతో వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా రోజూ ఆమె వచ్చింది. మాతృదేవి చెప్పినట్లే తలుపు దగ్గర మనస్సులోని ఆవేదనను కన్నీళ్ల ద్వారా తెలియపరుస్తూ ఒక గంటసేపు కూర్చొని వెళ్లిపోయేది. మాతృదేవి ప్రతి రోజు దీనిని చూసినా ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆమె స్థితిలో ఎలాంటి మార్పూలేదు.
రాధూను వదలుకోవడం
ఇలా ఒకటి తర్వాత ఒకటిగా సంఘటనలు జరుగుతున్నాయి. కానీ రాధూను కూడా వదలుకుంటారని ఎవరు ఊహించుకోగలరు? అదీ జరగనే జరిగింది. ఒక రోజు భక్తుడొకడు మాతృదేవితో, “మీ ఆరోగ్యం ఇంతగా పాడైపోయిందే! ఇంత బలహీనంగా మిమ్మల్ని నే నెప్పుడూ చూసింది లేదు” అన్నాడు. అందుకు మాతృదేవి, “అవును నాయనా! శరీరం చాలా బలహీనమైపోయింది. ఈ శరీరం మూలంగా గురుదేవుల కార్యాలు ఏవేవి జరగాలో అవన్నీ పూర్తయ్యాయనిపిస్తుంది. ఇప్పుడు నా మనస్సు ఆయననే కోరుతూవుంది, మరిదేన్నీ కోరటంలేదు. చూడు! రాధూను ఎంతగా ప్రేమించాను, ఆమె సంతోషం కోసం సదుపాయాల కోసం ఎన్ని శ్రమలకోర్చాను. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఆమె నా దగ్గరకు వస్తేనే ఏదోలా అనిపిస్తోంది. ‘ఈమె ఎందుకు ఇక్కడికి రావాలి? నా మనస్సును దిగజార్చడానికి ఎందుకు ప్రయత్నించాలి?’ అనే ఆలోచన వస్తున్నది. తమ కార్యం కోసం గురుదేవులు నా మనస్సును వీటన్నిటితో పాటు బంధించివుంచారు. లేకపోతే ఆయన నిష్క్రమించిన తర్వాత నేను జీవింప గలిగి ఉండేదాన్నా?” అన్నారు. చెప్పడం మాత్రమే కాదు అలాగే చేశారు కూడా. ఒక రోజు రాధూను పిలిచి, “నువ్వు ఇకపై ఇక్కడ ఉండవద్దు. జయరాంబాటికి వెళ్లిపో” అన్నారు. ప్రక్కనే సరళ, “అమ్మా! మీరేమంటున్నారు? రాధూ లేకుండా మీరు ఉండలేరే!” అంది. అందుకు మాతృదేవి నిశ్చయ ధోరణిలో “తప్పక ఉండగలుగుతాను! నా మనస్సును ఆమె నుండి ఉపసంహరించుకున్నాను” అన్నారు.
మాతృదేవి మాటలను యోగిన్ మా తోనూ, స్వామి శారదానందతోను చెప్పింది సరళ. యోగిన్ మా వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి, “అమ్మా! రాధూను ఎందుకు వెళ్లిపోమంటున్నారు?” అని అడిగింది. అందుకు మాతృదేవి, “యోగిన్! ఇకపై ఆమె జయరాంబాటిలోనే నివసించితీరాలి. ఆమెను అక్కడికి పంపించు. ఆమె నుండి నా మనస్సును ఉపసంహరించుకున్నాను. ఇక వారు పనికిరారు” అన్నారు. ఈ మాటలు విన్న యోగిన్ మా, “అమ్మా! అలా చెప్పకండి. రాధూ నుండి మీ మనస్సును ఉపసంహరించుకొంటే మా కందరికీ ఇక గతి ఎవరు?” అంటూ ఆవేదనతో అడిగింది. కానీ మాతృదేవి దృఢంగా “యోగిన్! నా అనురక్తి నంతా ఛేదించేశాను. ఇక ఇలాంటి మాటలే మాట్లాడకు!” అన్నారు. యోగిన్ మా ఈ విషయాలను స్వామి శారదానందతో చెప్పారు. ఆమె చెప్పినదంతా ప్రశాం తంగా విని ఆయన దీర్ఘంగా నిట్టూర్చి ఆవేదనతో, “అలా అయితే మాతృదేవిని మనం ఎక్కువ రోజులు ప్రాణాలతో చూడలేం. రాధూ నుండి ఆమె వైదొలగా రంటే ఇక మరే దారీ లేదు” అన్నారు.
తర్వాత ప్రక్కన నిలబడివున్న సరళతో, “నువ్వు చాలాసేపు మాతృదేవి దగ్గరే ఉంటున్నావు. మాతృదేవి మనస్సును రాధూవైపు త్రిప్పడానికి ప్రయత్నించి చూడు” అన్నారు. సరళ కూడా నానారకాల ప్రయత్నించింది, కానీ అవేవీ ఫలించలేదు. మాతృదేవి ఒక రోజు ఆమెతో, “నువ్వు ఎంతగా ప్రయత్నించినా, విడివడిన మనస్సు మళ్లీ కిందికి రాదు. దీనిని అర్థం చేసుకో” అన్నారు. తర్వాత సరళ కూడా తన ప్రయత్నాలు మానుకొంది.
రాధూ నుండి మాత్రమే కాకుండా నళిని, మాకూ, వారి బిడ్డలు అందరి నుండీ మాతృదేవి తమ మనస్సును ఉపసంహరించుకొన్నారు. అందరినీ జయరాంబాటికి పంపమన్నారు. వారు కంటబడినా సహింపలేకపోయారు. అందువల్ల నళిని ఆమె కంట బడడానికే జంకేది. ఒక రోజు ఆమె ఎడతెగకుండా ఏడుస్తూ, “మేం ఇక్కడ ఉండడం వల్ల మాతృదేవి ఇంతగా ఆవేదన పడుతూ ఉన్నారంటే వెళ్లిపోతాం. కాని చూసిన వాళ్లు ఏమనుకుంటారు? మాతృదేవి వ్యాధి గ్రస్థురాలై ఉన్న ఈ సమయంలో ఆమెకు ఆసరాగా ఉండకుండా ఇక్కడికి వచ్చే శారే అని కదా మాట్లాడుకుంటారు!” అంది. స్వామి శారదానంద కూడా వారి కోసం మాతృదేవితో ప్రాథేయపడ్డాడు. “అమ్మా! మీరు ఇలా వ్యాధితో బాధపడు తున్నప్పుడు మిమ్మల్ని వదలి వెళ్లిపోవాలంటే వారి మనస్సులు ఎంత క్షోభిస్తాయో కదా! మీరు కాస్త కోలుకొన్న తర్వాత వారు వెళ్లిపోతారు.” అప్పుడు మాతృదేవి దృఢంగా, “ఇప్పుడే వారినందరినీ పంపివేయడం మంచిది. లేకపోతే వారందరు సర్వాంతర్యామి నా దగ్గరకు రాకుండా చూడండి వారి నీడను కూడా నా మీద పడడం భరించ లేను” అన్నారు.
ఆమె ఎంత నిశ్చయంగా ఉన్నదీ తెలియజేయడానికో అన్నట్లు జరిగింది ఒక సంఘటన. ఒక రోజు మాతృదేవి నేలమీద పరుపు వేసుకుని పడుకుని ఉన్నారు. అప్పుడు రాధూ చంటిబిడ్డయైన వనవిహారీ ప్రాకుతూ మాతృదేవిని సమీ పించాడు. అప్పుడు మాతృదేవి ఆతనితో, “నీ పట్ల ఉన్న అనురక్తిని ఉపసంహ రించుకొన్నాను. వెళ్లిపో. ఇకపై నువ్వు నన్ను బంధించివుంచలేవు” అంటూ ప్రక్కనే ఉన్న శిష్యునితో, “ఈ బిడ్డను తీసుకెళ్లు, వీడి గురించి నాకు ఎలాంటి ఆతురతా లేదు” అన్నారు.
ఇవన్నీ జరుగుతున్నప్పుడు రాధూకు ఎలావుంటుంది? ఇంతకాలమూ అను రాగాన్ని వర్షించిన మాతృదేవి ఇప్పుడు ఇలా ప్రవర్తించడాన్ని ఆమె ఎలా భరించ గలదు? అందువల్ల ఒక రోజు జంకుతూనే మాతృదేవి దగ్గరకు వెళ్లింది. మాతృ దేవి వెంటనే, “ఇదిగో చూడు! (నా మనస్సును) విప్పి వదలివేశాను. ఇక నువ్వు నన్ను ఏం చేయగలవు? నేను కేవలం మానవమాత్రురాలినా ఏమిటి?” అన్నారు. రాధూకు ఈ మాటలు అంతగా అర్థంకాలేదు. అయినా, తాను ఆమె దగ్గరికి వెళ్లడం మాతృదేవికి ఇష్టంలేదని చక్కగా గ్రహించింది. దాంతో బాధపడి వెళ్లి పోయింది. ఇదే మాతృదేవి రాధూపడి ఆఖరుగా మాట్లాడిన మాటలు.
చివరి ఆయత్తాలు
రోజులు ఆవేదనాభరితంగా సాగిపోతున్నాయి. జూన్ నెలలో ఒక రోజు మాతృదేవి శిష్యునొకణ్ణి పిలిచి గదిలోని గురుదేవుల పటాన్ని మరొక గదిలో ఉంచమన్నారు. కారణం అడిగినందుకు వారందరితో మాతృదేవి, “ఇక నేను లేచి నడవలేను. పరిశుభ్రంగా లేని ఈ స్థితిలో నా గది పూజ గదిగా కూడా ఉండడం సబబు కాదు” అన్నారు. అందుతోపాటు మంచం మీదున్న తమ పరుపును నేల మీద వేయించారు. నేల మీద పడుకునే ప్రాణం వదలివేయాలని శాస్త్ర నియమాన్ని తలచుకున్నారో ఏమో!
ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు కూడా మాతృదేవి గురు దేవులకు నైవేద్యం చేసిన తర్వాతే ఏదైనా తీసుకునేవారు. అలా కానప్పుడు మానసికంగా ఆయనకు నైవేద్యం అర్పించిన తర్వాత తాము పుచ్చుకొనేవారు. ప్రతిక్షణమూ తమను గురుదేవులకు అర్పించుకొన్నారు – “సకలమూ ఆయన ఇచ్ఛ. సకలమూ ఆయన నియంత్రిస్తారు, ఆయన ఇచ్ఛానుసారమే అంతా జరుగు తుంది” అని చెబుతూనే ఉన్నారు. ఎవరైనా ఆమెతో, “అమ్మా! మీ వ్యాధి ఎప్పుడు నయమవుతుంది?” అని అడిగితే అందుకు మాతృదేవి, “గురుదేవులు ఎప్పుడు తలచుకుంటారో అప్పుడు నయమవుతుంది. కానీ గురుదేవుల ఇచ్ఛ అదికాదని పిస్తోంది. మీ శ్రేయస్సుకోసం ఈ వ్యాధి నయమవ్వాలని నేను వారిని ప్రార్థించడం లేదనుకొంటున్నారా? మునుపు నా ఆరోగ్యం కోసం ప్రార్థించినప్పుడు వెంటనే నాకు ప్రత్యక్షమయ్యేవారు. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. ఈ శరీరం ఇంకా నిలిచివుండాలనేది ఆయన సంకల్ప కాదేమో అనిపిస్తోంది. అయితే ఏం? నేను శరత్‌ను వదలి వెళుతున్నాను గదా!” అన్నారు.
జూలై నెల ప్రారంభం కాగానే మాతృదేవి ఆరోగ్యం త్వరితగతిలో క్షీణించ సాగింది. రక్తహీనత కారణంగా కాళ్లు బాగా ఉబ్బాయి. లేచి కూర్చోవడానికి కూడా ఆమెకు వీలుకాలేదు. నివేదిత పాఠశాల బాలికలు ఒకరి తరువాత ఒక రుగా మాతృదేవికి విసరడం లాంటి పనులు చేయసాగారు. జూలై నెల బహుశ పదవ తేది మాతృదేవి హఠాత్తుగా స్వామి శారదానందను పిలిచారు. ఆయన వచ్చి మాతృదేవి ప్రక్కన కూర్చున్నారు. మాతృదేవి తమ కుడి చేతిలో ఆయన ఎడమ చేతిని పట్టుకుని, “నాయనా! గోలాప్, యోగిన్ అందరూ ఉన్నారు. అంద రినీ చూసుకో” అన్నారు. తర్వాత తమ చేయిని తీసేసుకున్నారు. శారదానంద విషణ్ణ వదనంతో మాతృదేవిని చూస్తూ వెనుకకు అడుగులు వేస్తూ గది నుండి వెళ్లిపోయారు.
స్వామి హరిప్రేమానంద జయరాంబాటి నుండి వచ్చాడు. కొత్తగా త్రవ్విన బావి నుండి తెచ్చిన నీటిలో ఒకటి రెండు చుక్కలు మాతృదేవి సేవించేటట్లు చేశాడు. తర్వాత ఆమెతో, “అమ్మా! కిశోరీ మహరాజు మీ గదికి సిమెంటు చేయించారు. ఇక మీరు అక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి శ్రమావుండదు” అన్నాడు. అందుకు మాతృదేవి, “ఎందుకు సిమెంటు వేయాలి? మట్టి గచ్చు మంచిది. కానీ వీటన్నిటి వల్ల ప్రయోజనమేమిటి? నేను మళ్లీ అక్కడికి వస్తున్నా నని కిశోర్ అనుకుంటున్నాడా? ఇక నేను అక్కడికి వెళ్లను” అన్నారు.
దేహ త్యాగం
తమ మనస్సును లోకం నుండి వైదొలగించి, బంధుబాంధవుల నుండి ఉప సంహరించి, రాధూ నుండి కూడా విడవడజేసి మాతృదేవి ఇప్పుడు శరీరం నుండి కూడా వైదొలగజేసే సమయం ఆసన్నమైంది. మహాత్ముల జీవితాలలో ఇది అత్యంత ముఖ్యమయిన ఘట్టం. భగవంతుని ఆదేశానుసారమో, కారుణ్యవశు లవ్వడం వల్లనో వారందరు మానవ శ్రేయస్సుకోసం కార్యోన్ముఖులవుతారు. ఇందుకోసం ఆత్మ స్వాతంత్ర్యాన్ని వారు తాత్కాలికంగా దూరంగా ఉంచవలసి వస్తుంది. తమ కార్యం పూర్తి కాగానే శరీరాన్ని త్యజించి, హద్దులు లేని ఆనంద హర్మ్యంలో విహరించి మరణంలేని మహోన్నత స్థితిలో ఆత్మ స్వాతంత్ర్యం చవిచూస్తారు. మాతృదేవి కూడా అందు నిమిత్తం నిర్ణయం తీసుకొన్నారు.
జూలై బహుశ 15 వ తేది. భక్తురాలైన అన్నపూర్ణ తల్లి వచ్చింది. అప్పుడు మాతృదేవి గదికి ఎవరినీ అనుమతించడం లేదు. అందువల్ల ఆమె తలుపు దగ్గర కన్నీళ్లతో మాతృదేవిని ప్రార్థిస్తూ కూర్చుంది. మాతృదేవి చూపు ఆమె మీదికి మళ్లింది. ఆమెను దగ్గరకు రమ్మని తలూపారు. లోపలికి వెళ్లిన ఆమె మాతృదేవి పాదాల మీద పడి, “అమ్మా! ఇక మాకు గతి ఎవరు?” అని విలపించసాగింది. మాతృదేవి హీనస్వరంలో, “గురుదేవులను నువ్వు చూశావు కదా! ఇక భయ మెందుకు?” అన్నారు. కొంతసేపు గడిచింది.
మళ్లీ ఆమెతో, “ఒక్క విషయం చెబుతాను. అమ్మాయీ! నీకు ప్రశాంతత కావాలంటే ఇతరులలో లోపాలు చూడకు, అందుకు బదులుగా నీ తప్పులను చూసుకో! లోకాన్నంతా సొంతం చేసుకోవడానికి నేర్చుకో! ఎవరూ అన్యులు కారమ్మా! లోకమంతా నీ సొంతమే” అన్నారు. మాతృదేవి భారంగా శ్వాసిం చారు. ఇంకా కొంతసేపు గడిచింది. హీనస్వరంలో మళ్లీ అన్నారు: “అమ్మాయీ! వచ్చిన వారందరికీ, ఇంతవరకు రాని వారందరికీ, ఇక రాబోయేవారికీ, ఆ నా బిడ్డలకందరికీ నా ప్రేమ తెలియజేయి. నా శుభాశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉంటాయి” అన్నారు. కారుణ్య సాగరమయిన మాతృదేవి నోటి నుండి వెలు వడిన తుది అమృత వాక్కులు ఇవి! సందేశానికి సందేశం! ప్రేమకు ప్రేమ! ఆశీస్సులకు ఆశీస్సులు! – అన్ని విషయాల్లోనూ మాతృదేవికి దీటు మాతృదేవే! చిట్టచివర ఇలాంటి ఒక అద్భుత ఉపదేశాన్ని, ఆశీస్సులను, సందేశాన్ని అందిం చారు.
చివరి మూడు రోజుల్లో ఇక మాటలు అంటూ ఏవీ లేవు. చెప్పలేని అలసటవలనా, మనస్సు సదా సర్వవేళలా అత్యంత ఉన్నతమయిన ఆధ్యాత్మిక స్థితిలోమగ్నమై ఉన్నందువలనా మాట్లాడలేకపోయారు. కళ్లు మూసుకునే పడుకునివున్నారు. ఎవరైనా ఆమెతో మాట్లాడ ప్రయత్నించినా ఆమె ఇష్టపడలేదు. ఒకసారి స్వామి శారదానందను పిలిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఒకటి రెండు మాటలకంటే ఎక్కువగా మాట్లాడలేకపోయారు.
జూలై 19 వ తేది మాతృదేవికి శ్వాసించడంలో శ్రమ కలిగింది. ఎంతో శ్రమపడి ఆమె భారంగా శ్వాసించగలిగారు. మొదటి అంతస్తులో ఉంటున్నారు మాతృదేవి. ఆమె శ్వాస పీల్చడం ఆ ఇల్లంతా వినిపించింది ఆమె కళ్లు పీక్కుపోయి బయటికి వచ్చేట్లుగా ఉన్నాయి. భక్తులు, శిష్యులు అందరి హృదయాలను ద్రవింపచేసిన దృశ్యమది. సుధీర, సరళ ఆమె ప్రక్కనే నిలబడివున్నారు. ప్రతిసారి శ్వాసించినప్పుడు సరళ గంగాజలం చుక్కచుక్కగా మాతృదేవి నోట్లో పోస్తూవుంది. ఇలా ఒక రోజు గడిచింది.
జూలై 20 వ తేది సాయంత్రానికి శ్వాసించడం తగ్గసాగింది. అది ఇంకాతగ్గుతూ, మరింత తగ్గుతూ రాత్రి 1.30 గంటలకు పూర్తిగా ఆగిపోయింది. ఆ తర్వాత ఆమె శరీరంలో ఆశ్చర్యపడదగిన కొన్ని మార్పులు వచ్చాయి. ఆమె శరీరంలోని ముడతలు పూర్తిగా పోయి, నూతన తేజం వచ్చింది. పీక్కుపోయిన కళ్లు మామూలు స్థితికి రావడంతోపాటు ప్రశాంతమై ఒక దివ్యతేజస్సు ఆ శరీరంనుండి బహిర్గతం కాసాగింది.
మర్నాడు ఉదయం ఆమె దివ్యదేహాన్ని నాలుగుమైళ్ల దూరంలోని బేలూరు మఠానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. గంగానదిలో స్నానం చేయించి, పుష్పాలు, చందనం, నూతన వస్త్రాలు అలంకరించారు. అలంకరింపబడిన మాతృదేవి దివ్యదేహాన్ని శిష్యులు తమ భుజాలపై మోసుకెళ్లారు. స్వామి శివానంద, స్వామి శారదానంద, అసంఖ్యాక భక్తులు, రామనామ సంకీర్తనం పాడుకుంటూ వెళ్లారు. వీరితోపాటు కలకత్తా నగర ప్రముఖులూ, జనసామాన్యమూ తండోపతండాలుగా నడచివచ్చారు. మొదట వందల సంఖ్యలోని జనసందోహం రానురాను వేల సంఖ్యకు పెరిగింది. బేలూరు మఠంలో చందన కట్టెలతో పేర్చబడిన చితిమీద ఆమె దివ్య దేహాన్ని ఉంచి, చితికి నిప్పంటించారు. అప్పుడు మధ్యాహ్నం రెండు గంటలు దాటివుంటుంది.
అంతలో ఆకాశంలో మబ్బులు క్రమ్ముతూ, గంగానదికి ఆవలివైపు మేఘావృతమై నల్లబడింది. చినుకులు కూడా పడసాగాయి. వర్షం వల్ల ఆటంకం కలుగుతుందేమోనని భక్తులు భయపడ్డారు. కానీ మాతృదేవి దివ్యదేహం మండుతూవున్నంతదాకా వర్షం దూరంలోనే కురుస్తూ వచ్చింది. ఇటువైపుగారానేలేదు. కారుమబ్బులు రాసాగాయి. చందన కట్టెలు పూర్తిగా కాలిపోయాయి.* శారదానంద కమండలం నిండుగా గంగాజలం తీసుకువచ్చి ముందుగా చితిమీదచల్లారు. తర్వాత అక్కడ కూడా వర్షం పడడంతో, మానవ ప్రయత్నం లేకుండానే మాతృదేవి చితి నీటితో అర్చించబడింది. అవును! భక్తులు, శిష్యులు మాత్రం కాదు; ప్రకృతి కూడా తన యజమానికి అంజలి ఘటిస్తూన్నట్లు మేఘాలు వర్షించిన నీటితోనే చితి చల్లబడింది.
సర్వాంతర్యామి
మాతృదేవి భౌతిక శరీరం కనుమరుగైపోయింది. మాతృదేవి? వారు ఎలా నిష్క్రమిస్తారు? “నాయనా! నాకు విశ్రాంతి అనేదే లేదు. నా బిడ్డలందరికోసం నేను శ్రమిస్తూనే ఉంటాను. నా శరీరం కనుమరుగయిన తర్వాత కూడా వారి శ్రేయస్సును నేను గమనించే తీరాలి” అనే అమృత వాక్కులను వక్కాణించిన వారు కదా మాతృదేవి! ఆమె ఎక్కడకు వెళ్లగలరు? కానీ భక్తులు? ఈ చరిత్రను చదువుతూన్న మనకే హృదయాలు ద్రవిస్తున్నాయంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ అంటూ రాత్రింబవళ్లు అనవరతమూ కురిపించిన ఆమె అనురాగ వృష్టిలో తడిసిపోయిన వారందరూ ఆమె ఎడబాటును ఎలా భరించగలుగుతారు? అలా శోకిస్తున్న ఒకరితో సుబోధానంద ఇలా అన్నారు: “నాయనా! ఎందుకు శోకిస్తున్నావు? మాతృదేవి ఇంతవరకు ఒక్క శరీరంలోనే జీవించారు. ఇప్పుడు సర్వాంతర్యామి అయిపోయారు; ఎందుకు, మీ ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ నిండివున్నారు. ఇక మీరు మాతృదేవిని చూడడానికి ఎక్కడికీ వెళ్లవలసింది లేదు. ఉన్నచోటే ఉంటూ, హృదయపూర్వకంగా పిలిస్తే ఆమె మీ ముందు కనబడతారు.” ఎంత యథార్థమైన మాటలు! ఎంద రెందరో భక్తుల జీవితాల్లో ఈ వచనాలను రూఢిపరుస్తూ ఇప్పటికీ జీవిస్తూన్నారు కదా మాతృదేవి!