శ్వేతాశ్వతరోపనిషత్తు – రెండవ అధ్యాయం
అగ్నిర్యత్రాభిమథ్యతే వాయుర్యత్రాధిరుధ్యతే ।
సోమో యత్రాతిరిచ్యతే తత్ర సంజాయతే మనః ॥ 6
అగ్ని మథనం జరిగేచోట, వాయువు నిరోధమయ్యే చోట, సోమ రసం ప్రవహించే చోట, (పరిపూర్ణ) మనస్సు ఉత్పత్తవుతుంది.
త్రిరున్నతం స్థాప్య సమం శరీరం
హృదీంద్రియాణి మనసా సన్నివేశ్య ।। 7
బ్రహ్మోడుపేన ప్రతరేత విద్వాన్
స్రోతాంసి సర్వాణి భయావహాని ॥ 8
వక్షం, కంఠం, శిరస్సు – ఈ మూడింటిని ఉన్నతంగా నిలిపి (కూర్చుని), చక్షురాదింద్రియాలను, మనస్సును హృదయంలో నిలిపి, బ్రహ్మమనే తెప్పలో భయంకర (జన్మ మరణ) ప్రవాహాలను అన్నిటినీ, విద్వాంసుడు దాటినేస్తాడు.
ప్రాణాన్ప్రహీడ్యేహ సంయుక్తచేష్టః
క్షీణేప్రాణే నాసికయోచ్చ్వసీత ।
దుష్టాశ్వయుక్తమివ వాహమేనం
విద్వాన్ మనోధరయేతాప్రమత్తః ॥ 9
(క్రమవిధానాన్ని అనుసరిస్తూ) వివేకి ప్రాణవాయువులను నిరోధించాలి. ప్రాణవాయువు శాంతించినప్పుడు, ముక్కుపుటాలతో ఊపిరి వదలాలి. దుష్టాశ్వాలున్న రథాన్ని, సారథి జాగ్రత్తతో నడిపించేలా, పూనికతో మనస్సును నిరోధించాలి.
సమే శుచౌ శర్కరవహ్నివాలుకా
వివర్జితే శబ్దజలాశ్రయాదిభిః ।
మనోనుకూలే న చ చక్షుపీడనే
గుహానివాతాశ్రయణే ప్రయోజయేత్ ॥ 10
(గుహలవంటి ఏకాంత స్థలాల్లో), రాళ్ళు, ఇసుక లేని సమభూమిపై పరిశుద్ధ ప్రదేశాల్లో, అగ్నిభయం లేనిచోట, జలపాతాదులవల్ల శబ్దం రానిచోట, కంటికి ఇంపుగా మనస్సుకు అనుకూలంగా ఉండే ప్రదేశాల్లో యోగాన్ని అభ్యాసం చేయాలి. (పరమాత్మలో చిత్తాన్ని చేర్చాలి).
నీహారధూమార్కానిలానలానామ్
ఖద్యోతవిద్యుత్ – స్పటిక – శశానామ్ ।
ఏతాని రూపాణి పురస్సరాణి
బ్రహ్మణ్యభివ్యక్తికరాణియోగే ॥ 11
మంచు పొగ సూర్యుడు వాయువు అగ్ని మిణగురులు మెరుపులు స్పటికం చంద్రుడు – ఈ రూపాలు క్రమంగా యోగంలో బ్రహ్మాన్ని సూచిస్తాయి.
పృథ్వ్యప్తేజోఽనిలఖేసముత్థితే
పంచాత్మకే యోగగుణే ప్రవృత్తే ।
న తస్య రోగో న జరా న మృత్యుః
ప్రాప్తస్య యోగాగ్నిమయమ్ శరీరమ్ ॥ 12
భూమి, జలం, వెలుగు, అగ్ని, ఆకాశం – వీటివల్ల యోగానుభవాలు కలిగినప్పుడు, యోగం మొదలవుతుంది. యోగాగ్నియుత శరీరం గల యోగిని రోగజరామరణాది దుఃఖాలు సమీపించలేవు.
లఘుత్వమారోగ్యమలోలుపత్వం
వర్ణప్రసాదః స్వరసౌష్ఠవమ్ చ ।
గంధ శ్శుభో మూత్రపురీష మల్పం
యోగప్రవృత్తిం ప్రథమాం వదంతి ॥ 13
యోగాభ్యాసం చేసేవానికి, ముందుగా అతని శరీరం తేలిక అవుతుంది. చర్మం మృదువై ముఖవర్చస్సు తేజరిల్లుతుంది. కోమల కంఠం ఏర్పడుతుంది. మూత్రపురీషాలు తగ్గిపోయి, శరీరం సువాసనామయమవుతుంది – ఇలా ఆర్యులు చెప్పారు.
యథైవ బింబం మృదయోపలిప్తం
తేజోమయం భ్రాజతే తత్ సుధాంతమ్ ।
దద్వాత్మతత్త్వం ప్రసమీక్ష్యదేహీ
ఏకః కృతార్థో భవతే వీతశోకః ॥ 14
మట్టితో నిండిన వెండి బంగారాలు, శుద్ధికాగానే పరిశుద్ధమయినట్లు, దేహధారి పురుషుడు ఆత్మతత్త్వాన్ని కనుగొనగానే అద్వితీయుడై కృతార్థుడై సర్వదుఃఖాతీతుడై ఒప్పుతాడు.
శంకరాచార్యులు ఉదాహరించిన యజ్ఞవల్క్య ప్రవచనము
ఆసనాని సమభ్యస్య వాంఛితాని యథావిధి ।
ప్రాణాయామం తతో గార్గి జితాసనగతోఽభ్యసేత్ ॥
ఓ గార్గీ యథావిధిగా ఆసనాలను అభ్యసించి దానిలో జయం పొందిన వ్యక్తి ప్రాణాయామాన్ని అభ్యాసం చేయాలి.
మృద్వాసనే కుశాన్ సమ్యగాస్తీర్యాజినమేవ చ ।
లంబోదరం చ సంపూజ్య ఫలమోదకభక్షణైః ॥
తదాసనే సుఖాసీనః సవ్యే న్యస్యేతరం కరం ।
సమగ్రీవ శిరాః సమ్యక్ సంవృతాస్యః సునిశ్చలః ॥
ప్రాఙ్మఖోదఙ్మఖోవా-పి నాసా గ్రన్యస్తలోచనః ।
అతిభుక్తమభుక్తంవా వర్జయిత్వా ప్రయత్నతః ॥
నాడీసంశోధనం కుర్యాదుక్తమార్గేణ యత్నతః ।
వృథా క్లేశో భవేత్తస్య తచ్చోధనమకుర్వతః ॥
కుశాసనంమీద వేసిన (జింక లేదా పులి) చర్మంపైన సుఖాసనంలో కూర్చుని, ఫలమోదకాలతో గణపతిని అర్చించాలి; కుడిచేతిని, ఎడమ అరచేతిలో పెట్టాలి; వక్షాన్ని కంఠాన్ని ఉన్నతంగా నిల్పాలి; పెదవులను చక్కగా మూసుకోవాలి; తూర్పుదిశలో లేదా ఉత్తరదిశలోగాని కూర్చుండాలి; అప్పుడు నాసికాగ్రంపై దృష్టి నిలపాలి. మితిమీరి భుజించటాన్ని బొత్తిగా భుజింపకుండటాన్ని ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టాలి. నియమపూర్వకంగా నాడులను శుద్ధిచేయాలి. నాడీశోధన చేయకపోతే, సాధన మొత్తం వ్యర్థమవుతుంది.
నాసాగ్రే శశభృద్బీజం చంద్రాతపవితానితం ।
సప్తమస్య తు వర్గస్య చతుర్థం బిందుసంయుతం ॥
విశ్వమధ్యస్థమాలోక్య నాసాగ్రే చక్షుషీ ఉభే ।
ఇడయాపూరయేద్వాయుమ్ బాహ్యమ్ ద్వాదశమాత్రకైః ॥
ఇడా, పింగళ నాడులు కలిసేచోట, ‘హం’ కారాన్ని భావించాలి. బాహ్యవాయువుతో పన్నెండు మాత్రలకాలం (క్షణాలు) వరకూ ఇడను పూరించాలి.
తతోఽగ్నిం పూర్వవద్ధ్యాయేత్ స్ఫురజ్జ్వాలావలీయుతమ్ ।
రుషష్ఠం బిందుసంయుక్తం శిఖీమండలసంస్థితమ్ ॥
ధ్యాయేత్విరేచయేద్వాయుమ్ మందం పింగలయా పునః ।
అక్కడే ‘రంగ్’ అనే మంత్రంతో ప్రజ్జ్వలిత అగ్నిని యోగి ధ్యానించాలి. అలా ధ్యానిస్తూ పింగళ (కుడిముక్కు) నుండి నెమ్మదిగా వాయువును వదలాలి.
పునః పింగలయాపూర్వ ఘ్రాణం దక్షిణతః సుధీః ॥
తద్విద్విరేచయేద్వాయుమిడయతు శనైశ్శనైః ।
మరల పింగళ నుండి గాలిని పీల్చి ఇడా నుండి నెమ్మదిగా వదలాలి.
త్రిచతుర్వత్సరం చాపి త్రిచతుర్మాసమేవ వా ॥
గురుణోక్తప్రకారేణ రహస్యేవం సమభ్యసేత్ ।
ప్రాతర్మధ్యందినే సాయం స్నాత్వా షట్కృత్వ ఆచరేత్ ॥
సంధ్యాదికర్మకృత్వైవ మధ్యరాత్రేఽపి నిత్యశః ।
ఇలా గురూపదేశాన్ని అనుసరించి, మూడుసంవత్సరాలు గానీ, మూడు
మాసాలుగానీ ఉదయ మధ్యాహ్న సాయం అర్థరాత్రాల్లో నిత్యం రహస్యంగా (ఒక గదిలో) నాడీశుద్ధి జరిగేవరకూ అభ్యాసం చేయాలి.
నాడీశుద్ధి మవాప్నోతి తచ్చిహ్నం దృశ్యతే పృథక్ ॥
శరీరలఘుతా దీప్తిర్జఠరాగ్ని వివర్ధనమ్ ।
నాదాభివ్యక్తిరిత్యేతల్లింగమ్ తుచ్చుద్ధిసూచనమ్ ॥
శరీరం తేలిక అవటం, ముఖం దీప్తిమంతం కావటం, జఠరాగ్ని ప్రజ్వలితం కావటం, నాదం వినిపించటం – ఇవీ నాడీశుద్ధికి లక్షణాలు.
ప్రాణాయామం తతః కుర్యాద్రేచపూరకకుంభకైః ।
ప్రాణాపానసమాయోగః ప్రాణాయామః ప్రకీర్తితః ॥
ఇప్పుడు రేచక – పూరక – కుంభకయుక్త ప్రాణాయామాన్ని అభ్యాసం చేయాలి. ప్రాణవాయువును అపానవాయువుతో చేర్చటమే ప్రాణాయామ మంటారు.
* * *
పూరయేత్ షోడశైర్మాత్రైరాపాదతలమస్తకమ్ ।
మాత్రైర్ద్వాత్రింశకైః పశ్చాద్రేచయేత్ సుసమాహితః ॥
సంపూర్ణకుంభవద్వాయోర్నిశ్చలం మూర్ద్ని దేశతః ।
కుంభకం ధారణం గార్గి చతుష్టష్ఠ్యా తు మాత్రయా ॥
ఓ గార్గీ! ఆపాదమస్తకపర్యంత శరీరాన్ని పదహారు మాత్రల కాలంలో పూరించాలి. ముప్పదిరెండు మాత్రల కాలం రేచకం చేయాలి. అరువదినాలుగు మాత్రల కాలం కుంభించాలి.
ఋషయస్తు వదంత్యన్యే ప్రాణాయామ పరాయణాః ।
పవిత్రీభూతాః పూతాంత్రాః ప్రభంజనజయే రతాః ॥
తత్రాదౌ కుంభకం కృత్వా చదుష్టష్ఠ్యా తు మాత్రయా ।
తయోశ్చ పూరయేద్వాయుమ్ శనైః షోడశమాత్రయా ॥
ప్రాణాయామపరాయణ ఋషులు ప్రాణాయామాన్ని మరొక రకంగా చెబుతారు. దానిలో కుంభకాన్ని అరువదినాలుగు మాత్రల కాలం చేయాలి. పదహారుమాత్రల్లో ప్రాణాన్ని వదలాలి. పదహారు మాత్రల కాలం వరకూ పూరించాలి.
ప్రాణాయామైర్దహేర్దోషాన్ ధారణాభిశ్చ కిల్బిషాన్ ।
ప్రత్యాహారాచ్చ సంసర్గాన్ ధ్యానేనానీశ్వరాన్ గుణాన్ ॥
ప్రాణాయామం వల్ల శరీరమాలిన్యాలు, ధారణవల్ల మనోమాలిన్యాలు, ప్రత్యాహారం వల్ల రాగజనిత మాలిన్యాలు తొలగిపోతాయి. సమాధివల్ల ఆత్మను ఆవరించిన దుర్గుణాలన్నీ నశిస్తాయి.
సాంఖ్యసూత్రాలు
మూడవ అధ్యాయం
భావనోపచయాత్ శుద్ధస్య సర్వం ప్రకృతివత్. 29
ధ్యానసిద్ధి వల్ల శుద్ధి చెందిన వ్యక్తికి, ప్రకృతి శక్తులన్నీ లభిస్తాయి.
రాగోపహతిః ధ్యానమ్. 30
రాగనివృత్తియే ధ్యానం.
వృత్తినిరోధాత్ తత్సిద్ధిః. 31
వృత్తినిరోధం వల్ల ధ్యానం సిద్ధిస్తుంది.
ధారణాసన స్వకర్మణా తత్సిద్ధిః. 32
ధారణ, ఆసన, స్వకర్మానుష్ఠానాల వల్ల ధ్యానం సిద్ధిస్తుంది.
నిరోధః ఛర్ది విధారణాభ్యామ్. 33
రేచక కుంభకాలు రెండింటివల్ల ప్రాణ నిరోధం కలుగుతుంది.
స్థిరసుఖ మాసనమ్. 34
స్థిరంగా, సుఖంగా ఉండేదే ఆసనం.
వైరాగ్యాదభ్యాసాచ్చ. 36
వైరాగ్యం, అభ్యాసం వల్లకూడా ధ్యానం సిద్ధిస్తుంది.
తత్వాభ్యాసాన్నేతి నేతీతి త్యాగాత్ వివేకసిద్ధిః. 74
తత్త్వాభ్యాసం వల్లా, ‘నేతి నేతి’ ద్వారా ప్రకృతి తత్త్వాలను వదలటం ద్వారా వివేకం సిద్ధిస్తుంది.
అకారాది విషయసూచిక
కాయేంద్రియ సిద్ధిరశుభ క్షయాత్రపసః 2.43
కూర్మనాడ్యాం స్థెర్యమ్ 3.32
కృతార్థం ప్రతి నష్టమస్యనష్టం తదన్య సాధారణత్వాత్ 2.22
క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః 3.15
క్లేశ కర్మవిపాకాశయైరపరామృష్టః… 1.24
క్లేశమూలః కర్మాశయో దృష్టాదృష్టజన్మవేదనీయః 2.12
క్షణతత్క్రమయోః సంయమాద్వివేకజం జ్ఞానమ్ 3.53
క్షణప్రతియోగీ పరిణామాపరాన్త నిర్గ్రాహ్యః క్రమః 4.32
క్షీణవుత్తేరభిజాతస్యేవ మణేర్గృహీ తృగ్రహణ… 1.41
గ్రహణ – స్వరూపాస్మితాన్వయార్థవత్వ సంయమాత్… 3.48
చంద్రే తారామ్యాహజ్ఞానమ్ 3.28
చితేరప్రతి సంక్రమాయాస్త దాకారాపత్తౌ… 4.21
చిత్తాంతర దృశ్యే బుద్ధిబుద్ధేరతి ప్రసంఙ్గః… 4.20
జన్మౌషధి మంత్రతపసమాధిజాః సిద్ధయః… 4.1
జాతిదేశకాలవ్యవహితానామప్యానంతర్యం… 4.9
జాతి లక్షణ దేశైరన్యతా-నవచ్చే దాత్తుల్యయోస్తతః… 3.54
జాత్యంతర పరిణామః ప్రకృత్యాపూరాత్ 4.2
తచ్చిద్రేషు ప్రత్యయాంతరాణి సంస్కారేభ్యః 4.26
తజ్జపస్తదర్థభావనమ్ 1.28
తజ్జః సంస్కారో-న్యసంస్కార ప్రతిబంధీ 1.50
తజ్జయాత్ ప్రజ్ఞాలోకః 3.5
తతో-ణిమాదిప్రాదుర్భావః కాయసంపత్… 3.46
తతో ద్వంద్వానభిఘాతః 2.48
తతో మనోజనిత్వం వికరణభావః ప్రధానజయశ్చ 3.49
తతః కృతార్థానాం పరిణామక్రమ సమాప్తిర్గుణానామ్ 4.31
తతః క్లేశకర్మ నివృత్తిః 4.29
తతః క్షీయతే ప్రకాశావరణమ్ 2.52
తతః పరమావశ్యతేంద్రియాణామ్ 2.55
తతః ప్రత్యక్చేతనాధిగమో-ప్యంత రాయాభావశ్చ 1.29
తతః ప్రాతిభశ్రావణవేదనాదర్శాస్వాదవార్తా జాయంతే 3.37
తత్పరం పురుషఖ్యాతేర్గుణ వైత్పష్ణ్యమ్ 1.16
తత్ర ప్రత్యయైకతానతా ధ్యానమ్ 3.2
తత్ర ధ్యానజమనాశయమ్ 4.6
తత్ర నిరతిశయమ్ సర్వజ్ఞత్వబీజమ్ 1.25
తత్ర శబార్ధజ్ఞానవికల్పైః సంకీర్ణా సవితర్కా… 1.42
తత్ర స్థిత్ యత్నో-భ్యాసః 1.32
తతస్తద్విపాకానుగుణానామేవాభివ్యక్తిర్వాసనానామ్ 4.8
తదపి బహిరంగం నిర్బీజస్య 3.8
తదభావాత్ సంయోగాభావో హానం తద్దృశేః కైవల్యమ్ 2.25
తదర్థ ఏక దృశ్యస్యాత్మా 2.21
తద సంఖ్యేయవాసానాభిః చిత్రమపి పరార్థం… 4.23
తదా ద్రష్టుః స్వరూపే-వస్థానమ్ 1.3
తదా వివేకనిమ్నం కైవల్య ప్రాగ్భావం చిత్రమ్ 4.25
తదా సర్వావరణమలాపేతస్య జ్ఞానస్యా-నస్త్యాత్… 4.30
తదుపరాగాపేక్షిత్వాచ్చిత్తస్య వస్తు జ్ఞాతాజ్ఞాతమ్ 4.16
తదేవార్థ మాత్ర నిర్భాసం స్వరూపశూన్యమివ సమాధిః 3.3
తస్మిన్సతి శ్వాసప్రశ్వాసాయోర్గతివిచ్చేదః… 2.49
తస్య ప్రశాంతవాహితా సంస్కారాత్ 3.10
తస్య భూమిషు వినియోగః 3.6
తస్య వాచకః ప్రణవః 1.27
తస్య సప్తథా ప్రాంతభూమిః ప్రజ్ఞా 2.27
తస్య హేతురవిద్యా 2.24
తస్యాపి నిరోధే సర్వనిరోధాన్నిర్బీజః సమాధిః 1.51
తా ఏవ సబీజః సమాధిః 1.46
తీర్వసంవేగానామాసన్నః 1.21
తారకం సర్వవిషయం సర్వథావిషయమక్రమంచేతి… 3.55
తాసామనాదిత్వం చాశిషో నిత్యత్వాత్ 4.10
తే ప్రతిప్రపవహేయాః సూక్ష్మాః 2.10
తే హ్లాద పరితాపఫలాః పుణ్యాపుణ్యహేతుత్వాత్ 2.14
తే వ్యక్త – సూక్ష్మా గుణాత్మానః 4.13
తే సమాధావువసర్గా వ్యుత్థానే సిద్ధయః 3.38
త్రయమంతరంగం పూర్వేభ్యః 3.7
త్రయమేకత్ర సంయమః 3.4
దుఃఖదౌర్మనస్యాంగమేజయత్వ – శ్వాసప్రశ్వాసా… 1.31
దుఃఖానుశయీ ద్వేషః 2.8
దృగ్దర్శనశక్త్యోరేకాత్మతైవాస్మితా 2.6
దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకారసంజ్ఞా… 1.15
దేశబంధశ్చిత్తస్య థారణా 3.1
ద్రష్టా దృశిమాత్రః శుద్ధో-పి ప్రత్యయానుపశ్యః 2.20
ద్రష్టృదృశ్యోః సంయోగో హేయహేతుః 2.17
ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థమ్ 4.22
ధారణాసు చ యోగ్యతా మనసః 2.53
ధ్యానహేయాస్తద్వృత్తమః 2.11
ధ్రువే తద్గతిజ్ఞానమ్ 3.29
న చ తత్ సాలంబనం తస్యావిషయీ భూతత్వాత్ 3.20
న చైక చిత్తతంత్రం వస్తు తదప్రమాణకం తదా కిం… 4.15
న తత్ స్వాభావం దృశ్యత్వాత్ 4.18
నాభిచక్రే కాయమ్యాహజ్ఞానమ్ 3.30
నిమిత్తప్రయోజకం ప్రకృతీనాం వరణభేదస్తు… 4.3
నిర్మాణచిత్తా న్యస్మితామాత్రాత్… 4.4
నిర్విచార – వైశరద్యే-ధ్యాత్మప్రసాదః 1.47
పరమాణు పరమమహత్వాంతో-స్య వశీకారః 1.40
పరిణామ తాప – సంస్కారదుఃఖగుణవృత్తివిరోధాచ్చ… 2.15
పరిణామత్రయ సంయమాదతీతానాగత జ్ఞానమ్ 3.16
పరిణామై కత్వాద్వస్తు తత్వమ్ 4.14
పురుషార్థశూన్యానాం గుణానం ప్రతిప్రసవః కైవల్యం… 4.33
ప్రకాశ – క్రియా – స్థితిశీలం భూతేంద్రియాత్మకం… 2.18
ప్రచ్చర్దన – విధారణాభ్యాం వా ప్రాణస్య 1.34
ప్రత్యయస్య పరచిత్తజ్ఞానమ్ 3.19
ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని 1.7
ప్రమాణ – విపర్యయ – వికల్ప – నిద్రా – స్మృతయః 1.6
ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యామ్ 2.47
ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తమేకమనేకేషామ్ 4.5
ప్రవృత్యాలోకన్యాసాత్ సూక్ష్మ – వ్యవహిత – విప్రకృష్ట… 3.26
ప్రసంఖ్యానే-ప్యకుసీదస్య సర్వథా 4.28
ప్రాతిభాద్వా సర్వమ్ 3.34
బంధకారణ శైథిల్యాత్ ప్రచారసంవేదనాచ్చ… 3.39
బలేషు హస్తిబలాదీని 3.25
బహిరకల్పితా వృత్తిర్మాహావిదేహా… 3.44
బాహ్యాభ్యంతర విషయాక్షేపీ చదుర్థః 2.51
బాహ్యభ్యంతరస్తంభవృత్తిః దేశకాలసంఖ్యాభిః… 2.50
బ్రహ్మచర్య ప్రతిష్ఠాయాం వీర్యలాభః 2.38
భవప్రత్యేయో విదేహ – ప్రకృతిలయానామ్ 1.19
భువనజ్ఞానం సూర్యో సంయమాత్ 3.27
మూర్థజ్యోతిషి సిద్ధదర్శనమ్ 3.33
మృదుమధ్యాధిమాత్రత్తతో-పి విశేషః 1.22
మైత్రీ – కరుణా – ముదితోపేక్షాణాం సుఖ – దుఃఖ పుణ్యాపుణ్య…1.33 మైత్ర్యాదిషు బలాని 3.24
యథాభిమతధ్యానాద్వా 1.39
యమ నియమాసన–ప్రాణయామ–ప్రత్యాహార–ధారణ–ధ్యాన… 2.29
యోగశ్చిత్తవృత్తి నిరోధః 1.2
యోగాంగానుష్ఠానాదశుద్దిక్షయే జ్ఞానదీప్తిః… 2.28
రూప–లావణ్య–బల–వజ్రసంహననత్వాని కాయ సంపత్ 3.47
వస్తుసామ్యే చిత్తభేదాత్తయోర్విభక్తః పంథాః 4.15
వితర్కబాధనే ప్రతిపక్షభావనమ్ 2.33
వితర్కవిచారానందాస్మితానుగమాత్ సంప్రజ్ఞాతః 1.17
వితర్కా హింసాదయః కృతకారితానుమోదితా… 2.34
విపర్యయో మిథ్యాజ్ఞానమతద్రూప ప్రతిష్ఠమ్ 1.8
విరామ ప్రత్యయాభ్యాసపూర్వః సంస్కారశేషో-న్యః 1.18
వివేక ఖ్యాతిరవిప్లవా హానోపాయః 2.26
విశేషదర్శిన ఆత్మభావ – భావనానివృత్తిః 4.24
విశేషావిశేష – లింగమాత్రాలింగాని గుణపర్వాణి 2.19
విశోకా వా జ్యోతిష్మతీ 1.36
విషయవతీ వా ప్రవృత్తి రుత్పన్నా మనసః… 1.35
వీతరాగవిషయం వా చిత్తమ్ 1.37
వృత్తయః పంచతయ్యః క్లిష్టా అక్లిష్టాః 1.5
వృత్తిసారూప్య మితరత్ర 1.4
వ్యాధి – స్త్యాన – సంశయ – ప్రమాదాలస్యావిరతి… 1.30
వ్యుత్థాన – నిరోధసంస్కారయోరభిభవ – ప్రాదుర్భావౌ… 3.9
శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్పః 1.9
శబ్దార్థ ప్రత్యయానామితరేతరాధ్యా సాత్ సంకరః… 3.17
శాంతోదితావ్యపదేశ్య ధర్మానుపాతీ ధర్మ 3.14
శాంతోతౌ తుల్యప్రత్యయౌ చిత్తస్యైకాగ్రతా… 3.12
శౌచ – సంతోష – తపః – స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని… 2.32
శౌచాత్స్వాంగజుగుప్సా పరైరసంసర్గః 2.40
శ్రద్ధా – వీర్య – స్మృతి – సమాధి – ప్రజ్ఞా – పూర్వక… 1.20
శ్రుతానుమాన ప్రజ్ఞాభ్యామన్య విషయా… 1.49
శ్రోత్రాకాశయోః సంబంధ సంయమాద్దివ్యం శ్రోత్రమ్ 3.42
సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః 2.13
సతు దీర్ఘకాల నైరంతర్యసత్కారాసేవితో… 1.14
సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వమ్ 2.36
సత్త్వ పురుషయోః శుద్ధిసామ్యే కైవల్యమితి 3.56
సత్త్వ పురుషయోరత్యంతాసంకీర్ణయోః ప్రత్యయావిశేషాద్… 3.36
సత్త్వ పురుషాన్యతాఖ్యాతి మాత్రస్య… 3.50
సత్త్వశుద్ధి – సౌమనస్యైకాగ్ర్యేంద్రియ జయ… 2.41
సదా జ్ఞాతాశ్చిత్త వృత్తయస్తత్ ప్రభోః… 4.17
సంతోషాదనుత్తమః సుఖలాభః 2.42
స పూర్వేషామపి గురుః కాలేనానవచ్చేదాత్ 1.26
సమాధి – భావనార్థః క్లేశతనూకరణార్థశ్చ 2.2
సమాధిసిద్ధి రీశ్వర ప్రణిధానాత్ 2.45
సమానజయాత్ ప్రజ్వలనమ్ 3.41
సర్వార్థతైకాగ్రతయోః క్షయోదయౌ చిత్తస్య… 3.11
సుఖానుశయీ రాగః 2.7
సూక్ష్మ విషయత్వంచాలింగ – పర్యవసానమ్ 1.45
సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాదపరాంత… 3.23
సంస్కారసాక్షాత్కరణాత్ పూర్వజాతిజ్ఞానమ్ 3.18
స్మృతిపరిశుద్ధౌ స్వరూపశూన్యేవ… 1.43
స్థాన్యుపనిమంత్రణీ సంగస్మయాకరణం… 3.52
స్థిరసుఖమాసనమ్ 2.46
స్థూల – స్వరూప – సూక్ష్మాన్వయార్థవత్వ సంయమాత్ 3.45
స్వప్ననిద్రాజ్ఞానాలంబనం వా 1.38
స్వరసవాహీ విదుషో-పి తథా స్వస్వ విషయాసంప్రయోగే చిత్తస్వరూపానుకార… 2.54
స్వస్వామిశక్త్యోః స్వరూపోలబ్దిహేతుః… 2.23
స్వాధ్యాయదిష్ట దేవతా సంప్రయోగః 2.44
హానమేషాం క్లేశవదుక్తమ్ 4.27
హదృయే చిత్ – సంవిత్ 3.35
హేతుఫలాశ్రయాలంబనైః సంగృహీతత్వాదేషామభావే… 4.11
హేయం దుఃఖమనాగతమ్ 2.16