ఒక రోజు నా కుమారుడు హరిచరణ్ను తీసుకొని మాతృదేవి దర్శనానికి వెళ్లాను. అతడు కాస్త మతిస్థిమితం లేనివాడు. మాతృదేవి సాన్నిధ్యంలో ఏదేదో వాగుతూ, “నాకు ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా పెట్టు” అని అడగడం మొదలు పెట్టాడు. మాతృదేవి కాస్త ప్రసాదం ఇచ్చారు. దానిని తింటూ అన్ని వైపులా చల్ల సాగాడు. “ఇది దేవాలయం. ఇక్కడ అశుభ్రపరచకు” అంటూ కోప్పడ్డాను. వెంటనే మాతృదేవి, “అతడు చిన్నవాడు. చేస్తే చేయనీ. అతడు తిన్న తరువాత శుభ్రపరచు” అని చెప్పారు.
నేను: అమ్మా! వీడికి ఏమైందో తెలియదు. బ్రాహ్మణుని చూసినా నమస్క రిస్తాడు, పశువును చూసినా నమస్కరిస్తాడు.
మాతృదేవి: అతడికి ప్రాణుల పట్ల దయ ఉన్నది.
ఒక కోజాగరి పూర్ణిమ రోజు.* నేనూ, నా కుమారుడూ ఉపవాసం చేసి, మాతృదేవిని దర్శించుకొని, పువ్వులతో ఆమెకు పాదపూజ చేశాం. “లక్ష్మీకటాక్ష ప్రాప్తిరస్తు! దీర్ఘాయుష్మాన్ భవ!” అంటూ మాతృదేవి నా కుమారుణ్ణి దీవించారు.
ఒక రోజు మాతృదేవి నాతో, “మిమ్మల్నందరినీ చూడడం నా కెంతో ఆనం దంగా ఉంది. కాని నిన్ను చూసినప్పుడు మాత్రం బాధ కలుగుతుంది. మంచి స్థితిలోవున్న, విద్యావంతుడైన కుమారుణ్ణి కోల్పోయావు కదా!” అంటూ వాపోయారు.
నేను: గురుదేవుల పాదపద్మాల పట్ల భక్తి కలగాలని దీవించండమ్మా!
మాతృదేవి: భక్తి సలుపుతూవుంటే భక్తి కలుగుతుంది.
నేను పగటిపూట వెళితే మాతృదేవి భోజనం చేయమంటారు. రాధూ భుజించాక నాకు వడ్డిస్తారు. కాని ఇది నైవేద్యానికి మునుపే జరిగేది. “పుత్రశోకంతో మనోవేదన అనుభవిస్తున్నావు. అందువలన నైవేద్యానికి మునుపే నువ్వు భుజించవచ్చు” అంటూ అందుకు కారణం కూడా చెప్పేవారు.
నేను: అమ్మా! మా ఇంట్లో ఇప్పటికే భోజన విషయం ఒక సమస్యగా పరిణ మించింది. అలాంటప్పుడు నైవేద్యానికి మునుపే నేను భోజనం చేయడమా?
మాతృదేవి: ఇక నీ ఇంట్లో ఆహారానికి లోటు ఉండదు.
ఒక రోజు మాతృదేవి నాతో ఇలా అన్నారు: “కనపడకుండా పోయిన నీ కుమారుడు బహుశా పిచ్చివాడయ్యాడేమోనని ఇక్కడ తిరుగాడుతున్న పిచ్చివారిని రప్పించి, వారిలో వెతికాను. కాని ఏమిటో నీ కుమారుడు బతికే ఉన్నాడని నాకు తోస్తున్నది. అవును, బతికే ఉన్నాడు. శరత్కూడా ఆ మాటే అంటున్నాడు.” “అతడు తిరిగి వస్తాడా?” అని అడిగినప్పుడు, “అవును, వస్తాడు” అన్నారామె.
ఒక రోజు బలరాంబాబు ఇంట్లో మాతృదేవిని చూడడానికి వెళ్లాను. అప్పుడు ఒక వ్యక్తి మాతృదేవికి కొంత డబ్బు ఇస్తూ, “అమ్మా! ఫలానా వ్యక్తి జబ్బుపడి ఉన్నాడు. ఆయనకు నయమయ్యేట్లు ఆశీర్వదించండి” అన్నాడు. ఆ మాటలు విని మాతృదేవి, “డబ్బు తీసుకు పో. పుట్టిన వారెవరైనా గిట్టే తీరాలి. ఇందులో నేనేం చేయగలను” అని అన్నారు. కొన్ని రోజులలోనే ఆ ఫలానా వ్యక్తి మరణించాడని తెలియవచ్చింది.
మాతృదేవి ధరించిన హారం, బంగారు గాజులు