శ్రీరామకృష్ణుల అవతార పరిసమాప్తి దశయందు నరేంద్రుడు (స్వామి వివేకానంద), కాళి (స్వామి అభేదానంద), తారక్ (స్వామి శివానంద) మొదలైన యువకభక్తులు బుద్ధగయకు పోయి కొన్నాళ్ళు ధ్యానాభ్యాసం చేశారు. అప్పుడు వారు అనేక దివ్యానుభవములను పొందారు. ఆ విషయాన్ని విని శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు ‘మంచిదే. వారిని కొన్నాళ్ళు అక్కడ ఉండనివ్వండి. కానీ (తన దేహాన్ని చూపిస్తూ) అంతా ఇక్కడే ఉంది. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు. ఎక్కడెక్కడ తిరిగినా చివరకు వారు ఇక్కడకు రావలసిందే’.