ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ ।
తద్వత్కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామీ ॥ 70
ఆపూర్యమాణమ్, అచల ప్రతిష్ఠమ్,
సముద్రమ్, ఆపః, ప్రవిశంతి, యద్వత్,
తద్వత్, కామాః, యమ్, ప్రవిశంతి, సర్వే,
సః, శాంతిమ్, ఆప్నోతి, న, కామకామీ.
ఆపః = నీరు, నదులు; ఆపూర్యమాణమ్ = నింపబడుతున్నది; అచలప్రతిష్ఠమ్ = నిర్వికారం, (చెలియలికట్ట నతిక్రమింపనిదియునగు); సముద్రమ్ = సముద్రంలో; యద్వత్ = ఏ విధంగా; ప్రవిశంతి = ప్రవేశిస్తున్నాయో, (అయ్యు దానిని కలచుటలేదో); తద్వత్ = అదే విధంగా; సర్వే = అన్ని; కామాః = కోర్కెలు, విషయాలు; యమ్ = ఏ పురుషునిలో; ప్రవిశంతి = విలీనమవుతాయో; సః = అతడు; శాంతిమ్ = శాంతిని; ఆప్నోతి = పొందుతాడు; కామకామీ = విషయాలను కోరేవాడు; న = శాంతిని పొందడు. తా ॥ పరిపూర్ణమై ఉన్న సముద్రంలో నదీప్రవాహాలు ప్రవేశించినా అది పొంగి చెలియలికట్టను దాటక స్థిరంగా ఉండే రీతిలో, ప్రారబ్ధవశాన అనివార్యాలైన విషయాలు ఎవరియందు ప్రవేశించి విలీనం అవుతున్నాయో, అంటే ఎవరిని కలతపెట్టలేవో అతడే శాంతిని పొందుతున్నాడు. కాని, విషయాలను కోరేవాడికి ఎన్నడూ శాంతి లభించదు. (భాగవతం. 11–8–5, 6 చూ:)