గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యమమ్ ॥ 18
గతిః, భర్తా, ప్రభుః, సాక్షీ, నివాసః, శరణమ్, సుహృత్,
ప్రభవః, ప్రలయః, స్థానమ్, నిధానమ్, బీజమ్, అవ్యయమ్.
(నేను) గతిః = కర్మఫలమూ; భర్తా = పోషకుణ్ణి; ప్రభుః = స్వామిని; సాక్షీ = ప్రాణుల శుభాశుభాలకు ద్రష్టను; నివాసః = వాసస్థానమనే; శరణమ్ = ఆశ్రయుణ్ణి; సుహృత్ = ప్రత్యుపకారాన్ని కోరకుండా హితాన్ని కూర్చేవాణ్ణి; ప్రభవః = స్రష్టను; ప్రలయః = సంహర్తను; స్థానమ్ = ఆధారమనే; నిధానమ్ = ప్రళయస్థానాన్ని; అవ్యయమ్ = అక్షయమైన; బీజమ్ = కారణాన్ని; (అయి ఉన్నాను.)
తా ॥ నేను కర్మఫలమునూ, పోషకుడనూ, ప్రభువునూ, సర్వప్రాణుల శుభాశుభాల ద్రష్టనూ, వాస స్థానాన్ని, శరణాగతుల ఆర్తిని హరించేవాణ్ణి, ప్రత్యుపకారాన్ని కోరకుండా హితాన్ని కూర్చేవాణ్ణి, స్రష్టను, సంహర్తను, ఆధారమూ, ప్రళయస్థానమూ, అక్షయమైన జగత్కారణమూ అయి ఉన్నాను.