సహస్రయుగపర్యంతం అహర్యద్ బ్రహ్మణోవిదుః ।
రాత్రిం యుగసహస్రాంతాం తేఽహోరాత్రవిదో జనాః ॥ 17
సహస్ర యుగపర్యంతమ్, అహః, యత్, బ్రహ్మణః, విదుః,
రాత్రిమ్, యుగ సహస్ర అంతామ్, తే, అహః రాత్ర విదః, జనాః.
అహః రాత్ర విదః = దివారాత్రుల తత్త్వం ఎరిగినవారైన; తే = ఆ; జనాః = యోగిజనులు; బ్రహ్మణః = బ్రహ్మకు; యత్ = ఏది; అహ = దినమో; తత్ = దానిని; సహస్ర యుగ పర్యంతమ్ = వేయియుగాల పరిమితిగలదానిగా; రాత్రిమ్ = రాత్రిని; యుగ సహస్ర అంతామ్ = సహస్రయుగ పరిమితిగలదానిగా; విదుః = గ్రహిస్తారు.
తా ॥ సహస్రయుగ నిడివి గల బ్రహ్మదేవుని పగలును, అట్టిదే అయిన రాత్రిని తెలుసుకున్న యోగులే, దివారాత్రాల తత్త్వాన్ని గ్రహించినవారు. (చంద్ర సూర్యుల మానాన్ని బట్టి ఎరుగువారు కారు, వారు అల్పజ్ఞులు.)