పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ।
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ॥ 9
పుణ్యః, గంధః, పృథివ్యామ్, చ, తేజః, అస్మి, విభావసౌ,
జీవనమ్, సర్వభూతేషు, తపః, చ, అస్మి, తపస్విషు.
పృథివ్యామ్ = భూమిలో; పుణ్యః = పవిత్రమైన; గంధః = గంధతన్మాత్రను; విభావసౌ చ = అగ్నిలో కూడా; తేజః = దీప్తిని; (నేనే)అస్మి = అయి ఉన్నాను; సర్వభూతేషు = సర్వభూతాలలో; జీవనమ్ = ప్రాణం(ఆయువును); తపస్విషు చ = తాపసులలో; తపః = తపస్సు (శీతోష్ణాది ద్వంద్వసహన సామర్థ్యాన్ని); అస్మి = అయి ఉన్నాను.
తా ॥ నేను పృథివియందు పవిత్ర గంధం గానూ, అగ్నియందు దీప్తి గానూ, జీవులందరిలోను ప్రాణవాయువు గానూ, వానప్రస్థాదులైన తపస్వులలో ద్వంద్వసహన రూపమైన తపశ్శక్తి గానూ విరాజిల్లుతున్నాను.