కిం కర్మ కిమకర్మేతి కవయోఽప్యత్ర మోహితాః ।
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ॥ 16
కిమ్, కర్మ, కిమ్, అకర్మ, ఇతి, కవయః, అపి, అత్ర, మోహితాః,
తత్, తే, కర్మ, ప్రవక్ష్యామి, యత్, జ్ఞాత్వా, మోక్ష్యసే, అశుభాత్.
కర్మ = ఆచరింపదగినది; కిమ్ = ఏది; అకర్మ = ఆచరింపదగనిది; కిమ్ = ఏది; ఇతి అత్ర = ఈ విషయంలో; కవయః అపి = మేధావులు కూడా; మోహితాః = భ్రాంతులైరి; (కనుక) యత్ = దేనిని; జ్ఞాత్వా = తెలుసుకుంటే; అశుభాత్ = సంసారమనే అశుభంనుండి; మోక్ష్యసే = ముక్తుడవుతావో; తత్ = ఆ; కర్మ = ఆ కర్మను; తే = నీకు; ప్రవక్ష్యామి = చెబుతాను.
తా ॥ కర్తవ్య అకర్తవ్య విషయంలో పండితులు కూడా భ్రాంతులవుతున్నారు. కనుక దేనిని గ్రహిస్తే (జన్మమృత్యు రూపమూ, కర్తృత్వభోక్తృత్వాది రూపమూ అయిన) సంసారం అనే అశుభం నుండి ముక్తి పొందుతావో, ఆ కర్మ తత్త్వాన్ని నీకు చెబుతాను.