ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః ।
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ ॥ 15
ఏవమ్, జ్ఞాత్వా, కృతమ్, కర్మ, పూర్వైః, అపి, ముముక్షుభిః,
కురు, కర్మ, ఏవ, తస్మాత్, త్వమ్, పూర్వైః, పూర్వతరమ్, కృతమ్.
ఏవమ్ = ఈ విధంగా; జ్ఞాత్వా = గ్రహించి; పూర్వైః = పూర్వులైన; ముముక్షుభిః అపి = మోక్షార్థులచే కూడా; కర్మ = కర్మ; కృతమ్ = అనుష్ఠింపబడింది; తస్మాత్ = కనుక; త్వమ్ = నీవు; పూర్వైః = ప్రాచీనులచే; పూర్వతరమ్ = పూర్వమే; కృతమ్ = ఒనర్చబడిన; కర్మ ఏవ = కర్మనే; కురు = ఆచరించు.
తా ॥ కర్మ ఈ విధంగా అహంకార రహితంగా ఒనర్చబడితే, అది బంధంగా పరిణమించదని గ్రహించి పూర్వులైన ముముక్షువులు కూడా కర్మను (చిత్తశుద్ధి కొరకు) ఆచరించి ఉన్నారు.