వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే ।
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఽహమాప్నుయామ్ ॥ 2
వ్యామిశ్రేణ, ఇవ, వాక్యేన, బుద్ధిమ్, మోహయసి, ఇవ, మే
తత్, ఏకమ్, వద, నిశ్చిత్య, యేన, శ్రేయః, అహమ్, ఆప్నుయామ్
వ్యామిశ్రేణ ఇవ = సందేహ కారణమైన వాక్యేన = వాక్యంతో; మే = నా; బుద్ధిమ్ = బుద్ధిని; మోహయసి ఇవ = భ్రమింపజేస్తున్నట్లు ఉన్నావు; యేన = దేని చేత; అహమ్ = నేను; శ్రేయః = శుభాన్ని; ఆప్నుయామ్ = పొందుతానో, తత్ ఏకమ్ = దానినొక్క దానినే; నిశ్చిత్య = నిశ్చయించి; వద = పల్కుము.
తా ॥ నీవు సందేహ కారణం వలే* అనిపిస్తున్న వాక్యాలతో నా మనస్సును భ్రాంతిలో తగుల్కొనజేస్తున్నట్లుగా ఉన్నావు. ఈ రెంటిలో దేనిచేత నేను శ్రేయాన్ని పొందగలనో నిశ్చయించి ఆ ఒక్కదానినే చెప్పు.