న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన ।
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ॥ 22
న, మే, పార్థ, అస్తి, కర్తవ్యమ్, త్రిషు, లోకేషు, కించన,
న, అనవాప్తమ్, అవాప్తవ్యమ్, వర్తే, ఏవ, చ, కర్మణి.
పార్థ = అర్జునా; త్రిషు = మూడు; లోకేషు = లోకాలలో; మే = నాకు; కించన = కొంచెమైన, ఎట్టి; కర్తవ్యమ్ = కర్తవ్యం; నాస్తి = లేదు; అనవాప్తమ్ = పొందబడనిది; చ = మరియు అవాప్తవ్యమ్ = పొందదగినది కూడా; న = లేదు; (అయినా) కర్మణి ఏవ = కర్మయందే; వర్తే = ప్రవర్తిల్లుతున్నాను.
తా ॥ (ఈ విషయానికి దృష్టాంతం నేనే.) పార్థా! ముల్లోకాలలో నాకు ఏ విధమైన కర్తవ్యమూ లేదు. నేను పొందనిది గాని, పొందవలసినది గాని లేదు. అయిననూ, లోకానికి ఒక ఆదర్శాన్ని నెలకొల్పే నిమిత్తం నేను సర్వదా కర్మ ఒనర్చుతున్నాను.