సంజయ ఉవాచ :
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః ।
న యోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవ హ ॥ 9
ఏవమ్, ఉక్త్వా, హృషీకేశమ్, గుడాకేశః, పరంతపః,
న, యోత్స్య, ఇతి, గోవిందమ్, ఉక్త్వా, తూష్ణీమ్, బభూవ, హ.
సంజయః = సంజయుడు; ఉవాచ = పలికెను; పరంతపః = శత్రుతాపకుడైన; గుడాకేశః = అర్జునుడు; హృషీకేశమ్ = శ్రీకృష్ణునితో; ఏవమ్ = ఇలా; ఉక్త్వా = పలికి; న యోత్స్య = యుద్ధం చేయను; ఇతి = ఇలా; (అని) గోవిందమ్ = కృష్ణునితో; ఉక్త్వా = పలికి; తూష్ణీం బభూవ హ = మౌనం వహించాడు.
తా ॥ సంజయుడు పలికెను: శత్రుతాపనుడు, జితనిద్రుడు అయిన అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా పలికి ‘నేను యుద్ధం చేయను’ అని వచించి మౌనం వహించాడు.