న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః ।
యానేవ హత్వా న జిజీవిషామః
తేఽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ॥ 6
న, చ, ఏతత్, విద్మః, కతరత్, నః, గరీయః,
యత్, వా, జయేమ, యది, వా, నః, జయేయుః,
యాన్, ఏవ, హత్వా, న, జిజీవిషామః,
తే, అవస్థితాః, ప్రముఖే, ధార్తరాష్ట్రాః
యద్వాజయేమ = మనం జయంపొందినా; యది వా = లేక; నః = మనలను (వీరు); జయేయుః = జయించినా; నః = మనకు; కతరత్ = ఏది; గరీయః = శ్రేయస్కరమో; ఏతత్ చ = దీనిని; న విద్మః = ఎరుగము; యాన్ = ఎవరిని; హత్వా = చంపి; న జిజీవిషామః = జీవింపగోరమో; తే = ఆ; ధార్తరాష్ట్రాః ఏవ = దుర్యోధనాదులే; ప్రముఖే = ఎట్టయెదుట; అవస్థితాః = ఉన్నారు.
తా ॥ (అధర్మదోషాన్ని అంగీకరించి యుద్ధంచేసినా) మనం వారిని జయించడమా? లేక వారు మనల్ని జయించడమా? –ఈ రెంటిలో ఏది శ్రేయమో తెలియజాలకున్నాను. (మరియు, మనం జయించినా అది పరాజయంతోనే సమమౌతుంది.) ఎవరిని వధించి మనం జీవింపగోరమో, ఆ దుర్యోధనాదులే మన ఎదుట ఉన్నారు.