కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః ।
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ ॥ 51
కర్మజమ్, బుద్ధియుక్తాః, హి, ఫలమ్, త్యక్త్వా, మనీషిణః,
జన్మబంధ వినిర్ముక్తాః, పదమ్, గచ్ఛంతి, అనామయమ్.
బుద్ధియుక్తాః = సమత్వబుద్ధిగల (నిష్కామ కర్మయోగులైన) మనీషిణః = ప్రాజ్ఞులు; కర్మజమ్ = కర్మవల్ల కలిగే; ఫలమ్ = ఫలాన్ని; త్యక్త్వా = త్యజించి; జన్మ బంధ వినిర్ముక్తాః = జన్మమనే బంధం నుండి విడివడి; అనామయమ్ = సర్వోపద్రవ రహితమైన; పదమ్ = బ్రహ్మపదాన్ని; హి = నిశ్చయంగా; గచ్ఛంతి = పొందుతున్నారు.
తా ॥ నిష్కామ కర్మయోగులైన ప్రాజ్ఞులు కర్మల వల్ల కలిగే ఫలాలను త్యజించి, జన్మబంధాల నుండి విడివడి, సర్వోపద్రవరహిత బ్రహ్మపదాన్ని పొందుతారు.