దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ ।
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపాణాః ఫలహేతవః ॥ 49
దూరేణ, హి, అవరమ్, కర్మ, బుద్ధియోగాత్, ధనంజయ,
బుద్ధౌ, శరణమ్, అన్విచ్ఛ, కృపణాః, ఫలహేతవః.
ధనంజయ = అర్జునా; హి = ఏలనన; కర్మ = కామ్యకర్మ; బుద్ధియోగాత్ = సమత్వబుద్ధియుక్తమైన నిష్కామకర్మ కంటే; దూరేణ = అత్యంత; అవరమ్ = అధమం; బుద్ధౌ = సమత్వబుద్ధిలో; శరణమ్ = ఆశ్రయాన్ని; అన్విచ్ఛ = అన్వేషించు; ఫలహేతవః = ఫలాలను గోరువారు; కృపణాః = హీనులు. తా ॥ అర్జునా! నిష్కామ కర్మ కంటే కామ్యకర్మ అత్యంత అధమమైనది. కనుక, నీవు కామనాశూన్యుడవై సమత్వబుద్ధిని ఆశ్రయించు. ఫలాకాంక్షులై కర్మలను ఆచరించేవారు హీనమైనవారు.