భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ।
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ॥ 35
భయాత్, రణాత్, ఉపరతమ్, మంస్యంతే, త్వామ్, మహారథాః,
యేషామ్, చ, త్వమ్, బహుమతః, భూత్వా, యాస్యసి, లాఘవమ్.
మహరథాః = మహారథులు కూడా; త్వామ్ = నిన్ను; భయాత్ = భయం వల్ల; రణాత్ = యుద్ధం నుండి; ఉపరతమ్ = తప్పుకొన్న వానిగా; మంస్యంతే = భావిస్తారు; చ = మరియు; త్వమ్ = నీవు; యేషామ్ = ఎవరికడ; బహుమతః = సమ్మానితుడవుగా; భూత్వా = పూర్వం ఉండీ; లాఘవమ్ = చులకన; యాస్యసి = అయ్యెదవు.
తా ॥ మహారథులైన కర్ణాదులు నీవు భయపడి యుద్ధం నుండి తప్పుకున్నావని తలుస్తారు; అంతేకాక నిన్ను ఇంతవరకు సమ్మానించిన వారిచేతనే చులకన చేయబడతావు.