అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి ।
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ॥ 33
అథ, చేత్, త్వమ్, ఇమమ్, ధర్మ్యమ్, సంగ్రామమ్, న, కరిష్యసి,
తతః, స్వధర్మమ్, కీర్తిమ్, చ, హిత్వా, పాపమ్, అవాప్స్యసి.
అథ = ఇంకా; త్వమ్ = నీవు; ఇమమ్ = ఈ; ధర్మ్యమ్ సంగ్రామమ్ = ధర్మయుద్ధాన్ని; న కరిష్యసి చేత్ = చేయక పోతే; తతః = దాన; స్వధర్మమ్ = క్షత్రియధర్మాన్ని; కీర్తిం చ = కీర్తిని కూడా; హిత్వా = పోగొట్టుకొని; పాపమ్ = (విహితధర్మ అనాచరణ ఫలమైన) పాపమును; అవాప్స్యసి = పొందుతావు.
తా ॥ అయినా కూడా నీవు ఈ యుద్ధం చేయడానికి తిరస్కరిస్తే, స్వధర్మ ఫలాన్ని, (ఇంతకు పూర్వం సంపాదించిన) కీర్తిని పోగొట్టుకొని స్వధర్మ త్యాగ ఫలిత పాపాన్ని పొందుతావు.