వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ ।
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ ॥ 21
వేద, అవినాశినమ్, నిత్యమ్, యః, ఏనమ్, అజమ్, అవ్యయమ్,
కథమ్, సః, పురుషః, పార్థ, కమ్, ఘాతయతి, హంతి, కమ్.
యః = ఎవడు; ఏనమ్ = ఈ ఆత్మను; అవినాశినమ్ = నాశం లేనిది; నిత్యమ్ = వృద్ధిరహితం; అజమ్ = జన్మరహితం; అవ్యయమ్ = క్షయం లేనిదని; వేద = గ్రహిస్తాడో; పార్థ = అర్జునా; సః = ఆ; పురుషః = వ్యక్తి; కథం = ఎలా; కమ్ = దేనిని; ఘాతయతి = చంపించును; కమ్ = దేనిని; హంతి = చంపును?
తా ॥ పార్థా! ఈ ఆత్మను అవినాశి, నిత్యం, అజం, అవ్యయం – అని గ్రహించిన వ్యక్తి, ఎవరిని ఎలా చంపిస్తాడు? ఎవరిని ఎలా చంపుతాడు?