అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ ।
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి ॥ 17
అవినాశి, తు, తత్, విద్ధి, యేన, సర్వమ్, ఇదమ్, తతమ్,
వినాశమ్, అవ్యయస్య, అస్య, న, కశ్చిత్, కర్తుమ్, అర్హతి.
యేన = దేని చేత; ఇదమ్ సర్వమ్ = ఈ జగత్తంతా; తతమ్ = పరివ్యాప్తమో; తత్ తు = దానినే; అవినాశి = వినాశ రహితంగా; విద్ధి = గ్రహించు; కశ్చిత్ = ఎవరు; అస్య = ఈ; అవ్యయస్య = అవ్యయాత్మకు; వినాశమ్ = వినాశం; కర్తుమ్ = చేకూర్చడానికి; న అర్హతి = సమర్థుడు కాడు.
తా ॥ (సద్వస్తువుకు పూర్వశ్లోకంలో సామాన్యంగా చెప్పబడిన అవినాశిత్వమే వివరింపబడుతోంది 🙂 ఏది ఈ (ఆగమాపాయి ధర్మాత్మకమైన దేహాది) సర్వ జగత్తును (సాక్షిస్వరూపంలో) వ్యాపించి ఉన్నదో, ఆ ఆత్మవస్తువు (స్వరూపం) నాశరహితం అని గ్రహించు. ఎందువలన అంటే, ఈ అవ్యయాత్మను వినష్టమొనర్చగల వారు లేరు.