భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః ।
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ॥ 8
భవాన్, భీష్మః, చ, కర్ణః, చ, కృపః, చ, సమితింజయః,
అశ్వత్థామా, వికర్ణః, చ, సౌమదత్తిః, తథా, ఏవ, చ
భవాన్ = మీరు; భీష్మః చ = భీష్ముడూ; కర్ణః = కర్ణుడు; సమితింజయః = సంగ్రామ విజయుడైన; కృపః చ = కృపాచార్యుడూ; తథా, ఏవ = అలాగే; అశ్వత్థామా చ = అశ్వత్థామ; వికర్ణః చ = వికర్ణుడూ; సౌమదత్తిః = సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు.
తా ॥ మన పక్షాన మీరు, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడైన కృపాచార్యుడూ, అలాగే అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు మొదలైన ప్రముఖులు ఉన్నారు.