అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ ।
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ॥ 7
అస్మాకమ్, తు, విశిష్టాః, యే, తాన్, నిబోధ, ద్విజోత్తమ,
నాయకాః, మమ, సైన్యస్య, సంజ్ఞార్థమ్, తాన్, బ్రవీమి, తే
ద్విజోత్తమ = విప్రవర్యా; తు = కాని; అస్మాకమ్ = మనలో; యే = ఎవరు; విశిష్టాః = ప్రధానులో; మమ = నా; సైన్యస్య = సేనకు; నాయకాః = అధ్యక్షులో; తాన్ = వారిని; నిబోధ = తెలుసుకోండి; తే = మీ; సంజ్ఞార్థమ్ = ఎరుక కొరకు; తాన్ = వారి పేర్లను; బ్రవీమి = తెలియజేస్తున్నాను.
తా ॥ విప్రవర్యా! మన పక్షాన ఉన్న ప్రసిద్ధ యోధులను, సేనాపతులను తెలుసుకోండి. మీకు తెలిసేందుకై వారి పేర్లను చెబుతున్నాను.