యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ।
ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ ॥ 46
యది, మామ్, అప్రతీకారమ్, అశస్త్రమ్, శస్త్రపాణయః,
ధార్తరాష్ట్రాః, రణే, హన్యుః, తత్, మే, క్షేమతరమ్, భవేత్.
అప్రతీకారమ్ = ప్రతిఘటింపనట్టి; అశస్త్రం = నిరాయుధుడనైన; మాం = నన్ను; శస్త్రపాణయః = శస్త్రధారులైన; ధార్తరాష్ట్రాః = ధార్తరాష్ట్రులు; రణే = యుద్ధంలో; యది హన్యుః = చంపినా కూడా; తత్ = అది; మే = నాకు; క్షేమతరం = ఇంతకన్నా మేలే; భవేత్ = అవుతుంది.
తా ॥ ప్రతిఘటించకుండా, నిరాయుధుడనై ఉన్న నన్ను శస్త్రధారులైన దుర్యోధనాదులు యుద్ధంలో చంపినా చంపెదరు గాక! – ఆ చావు ఇంతకంటే మేలే అవుతుంది.