అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ ।
యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ॥ 45
అహో, బత, మహత్, పాపమ్, కర్తుమ్, వ్యవసితాః, వయమ్,
యత్, రాజ్యసుఖలోభేన, హంతుమ్, స్వజనమ్, ఉద్యతాః.
అహో బత = అయ్యో; వయమ్ = మనం; మహత్ = గొప్ప; పాపమ్ = పాపాన్ని; కర్తుమ్ = చేయడానికి; వ్యవసితాః = పూనుకున్నాం; యత్ = ఏమంటే; రాజ్యసుఖ లోభేన = రాజ్యసుఖ లోభంతో; స్వజనమ్ = బంధువులను; హంతుమ్ ఉద్యతాః = వధించ పూనిన వారమయ్యాం.
తా ॥ అయ్యో! మనమెంత మహాపాపాన్ని చేయ పూనుకున్నాం! ఎందుకంటే రాజ్యం వల్ల కలిగే సుఖాశచేత బంధువులను చంప ఒడిగట్టామే!